మోడీ ప్లాన్: పవన్‌కు కౌంటర్‌గా తెరపైకి వెంకయ్య
విజయవాడ: ప్రత్యేక హోదా పైన జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు కేంద్రం తిప్పికొట్టే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది! ఏపీకి తాము ఏమి ఇచ్చాం, ప్రత్యేక హోదా ఎందుకు సాధ్యం కావడం లేదు, హోదాకు సమానమైన నిధులు ఎలా ఇస్తామో చెప్పే అవకాశాలున్నాయని అంటున్నారు.
గత తిరుపతి, మొన్న కాకినాడ సభలో ప్రత్యేక హోదా విషయమై పవన్ కళ్యాణ్ కేంద్రాన్ని తూర్పారబట్టారు. ముఖ్యంగా కేంద్రమంత్రి వెంకయ్య పైన నిప్పులు కురిపించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎంపీలను, విపక్షాలను టార్గెట్ చేసినప్పటికీ ప్రధానంగా బీజేపీని పవన్ నిలదీశారు.
వెంకయ్యని పవన్ టార్గెట్ చేయడం వెనుక: లడ్డూలకూ కథ
హోదా ఇస్తామని చెప్పిన మోడీ ప్రభుత్వం రెండు పాచిపోయిన లడ్డూలు ఇచ్చి సరిపెట్టుకుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకయ్య నాయుడు గారు అంటూనే షాకిచ్చే కామెంట్లు చేశారు.

పవన్ వ్యాఖ్యల పైన వెంకయ్య స్పందించారు కూడా. తాను ఎవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదని, ప్రజలకే జవాబుదారిని అన్నారు. వారికి మాత్రమే సమాధానం చెబుతానన్నారు. అంతటితో ఆగని ఆయన తనను కొందరు వ్యక్తిగతంగా దూషిస్తున్నారని, అది సరికాదన్నారు.
మరోవైపు, ఏపీ ప్రస్తుత పరిణామాల పైన ప్రధాని మోడీతో ఏపీ బీజేపీ నేతలు శనివారం సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మోడీ ప్యాకేజీ పైన వారి నుంచి ఆరా తీశారని తెలుస్తోంది. ఇదే సమయంలో పవన్ నిలదీత చర్చకు వచ్చిందని తెలుస్తోంది. పవన్‌కు వెంకయ్య, ఇతర నేతల ద్వారా కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమైయ్యారని అంటున్నారు. అందుకే వెంకయ్య తీవ్రంగా స్పందిస్తున్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications