బాబు క్యాబినెట్: ఉద్వాసనకు గురయ్యేవారు వీరే?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన నుంచి రాగానే తన మంత్రివర్గాన్ని పునర్వ్యస్థీకరించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ పునర్వ్యస్థీకరణలో ఐదుగురు మంత్రులకు ఆయన ఉద్వాసన పలికే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. గత నెల రోజుల్లో నిర్వహించిన సమీక్షల్లో ఐదు శాఖల మంత్రులను లక్ష్యంగా చేసుకుని ముఖ్యమంత్రి తీవ్ర అంసతృప్తిని వ్యక్తం చేశారు. దాంతో ఆ ఐదు శాఖలను నిర్వహిస్తున్న మంత్రులను ఉద్వాసన పలుకుతారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది.
ముఖ్యమంత్రి ఉద్వాసన పలికే మంత్రుల జాబితాలో ప్రధానంగా మహిళా శిశు సంక్షేమ మంత్రి పీతల సుజాత, ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్, పంచాయతీరాజ్ మంత్రి అయ్యన్నపాత్రుడు, సాంఘిక సంక్షేమ మంత్రి రావెల కిశోర్‌బాబు, దేవాదాయ మంత్రి పి మాణిక్యాలరావు, రెవిన్యూ మంత్రి కె. ఇ కృష్ణమూర్తి పేర్లు వినిపిస్తున్నాయి. శుక్రవారం నాడు నిర్వహించిన ఐదు సమీక్షల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో తీవ్రంగా విమర్శించిన శాఖలనే ఈసారి మరో మారు తీరు మార్చుకోవాలంటూ అసంతృప్తి వ్యక్తం చేయడంతో మంత్రుల ఉద్వాసన దాదాపు ఖాయం అంటున్నారు.
నిజానికి మంత్రుల తొలగింపు మూడు నెలల క్రితమే జరగాల్సి ఉంది. అయితే ఏడాది కాలంలోనే మంత్రివర్గ విస్తరణ సబబుకాదని, తర్వాత పార్టీ మహానాడు నిర్వహణ, కౌన్సిల్ ఎన్నికలు, అసెంబ్లీ ఒకదాని తర్వాత మరొకటి రావడంతో మధ్యలో మంత్రులను పిలిచి చంద్రబాబు స్వయంగా హెచ్చరికలు జారీ చేశారు. పనితీరు మెరుగుపరుచుకోవాలంటూ సూచించారు.

మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనుకుంటున్న సమయంలో అసెంబ్లీ సమావేశాలు రావడంతో చంద్రబాబు వెనక్కి తగ్గారు. సింగపూర్ పర్యటన నుండి రాగానే మంత్రివర్గ విస్తరణపై దృష్టిసారిస్తారని విశ్వసనీయ సమాచారం. లేకుంటే మరో నెల రోజులు ఆగి అక్టోబర్ లో రాజధాని శంకుస్థాపన అనంతరం మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశం ఉందని చెబుతున్నారు.
అవినీతి ఆరోపణలు, తరచూ వివాదాల్లో తరదూర్చడం, పరస్పర దూషణలు, అధికారులపై దుమ్మెత్తిపోయడం, వివాదాస్పద ప్రకటనలు చేయడం మంత్రుల తొలగింపునకు కారణమని చెబుతున్నారు. రెవిన్యూ మంత్రి పనితీరును పరోక్షంగా ప్రస్తావిస్తూ, రెవిన్యూ శాఖ అంటేనే ప్రజల్లో ఒక నెగిటివ్ భావం ఉండిపోయిందని, అవినీతి పేరుకుపోయిందన్న భావాలు ప్రజల్లో ఉన్నాయని, వీటిని తొలగించే విధంగా పనిచేయాలని సిఎం శుక్రవారం నాడు కలెక్టర్ల సమావేశంలో వ్యాఖ్యానించారు.
అలాగే డ్వాక్రా వ్యవస్థను ఇసుకమాఫియా ఫెయిల్ చేయాలని చూస్తోందని ఆరోపించారు. అంతిమంగా అవుట్‌కమ్ కావాలి, పర్సప్షన్ కావాలి, పర్సెప్షన్ పర్సెప్షనే, రియాలిటీ రియాలిటీనే అని ముఖ్యమంత్రి చెప్పారు. సిఎం వ్యాఖ్యలు నర్మగర్భంగా మంత్రుల తొలగింపును సూచిస్తోందని అంటున్నారు.
-
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..












Click it and Unblock the Notifications