విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మారేనా: చెప్పడం ఆపి చంద్రబాబు రివర్స్

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం జరిగిన తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తన సహజసిద్ధమైన శైలికి భిన్నంగా వ్యవహరించారు. రివర్స్‌లో ఆయన వ్యవహరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కార్యకర్తలు చెబుతుంటే కాగితంపై కలంతో రాసుకున్నారు.

పార్టీ సమావేశాల్లో చంద్రబాబు అంతా తానే అయి మాట్లాడేస్తుంటారు. నాయకులు, కార్యకర్తలు మౌనంగా కూర్చుని వినాల్సిందే. కానీ మంగళవారం మాత్రం కార్యకర్తలు మాట్లాడితే ఆయన ఓపిగ్డా విన్నారు. విజయవాడలో జరిగిన పార్టీ విస్తృతస్థాయి భేటీ ఏకబిగిన తొమ్మిది గంటల పాటు సాగింది.

సమావేశం ప్రారంభం కాగానే ‘నేనేం చేయాలో చెప్పండి.. మీ సలహాలు, సూచనలు నాకు కావాలి.. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో ఉన్న లోటుపాట్లు నిర్మొహమాటంగా చెప్పండి.. పొరపాట్లు ఉంటే సరి చేసుకుందాం' అని ఆయన మైక్‌ కార్యకర్తలకు ఇచ్చేసి పెన్నూ పేపరు తీసుకున్నారు.

Chandrababu reverse in TDP extended meeting

కార్యకర్తల నుంచి ఎమ్మెల్యేల వరకూ వివిధ అంశాలపై తమతమ అభిప్రాయాలను వెల్లడించారు. నిత్యావసర సరుకుల పంపిణీపై చర్చలో - ప్రభుత్వం అమలుచేస్తున్న నూతన విధానాల వల్ల 15 నుంచి 20 శాతం వరకూ రేషన్ ఆదా అవుతోందని, ఐరిస్‌, ఈ పోస్‌ వల్ల మధ్యవర్తుల దోపిడీ తగ్గి ప్రభుత్వానికి మిగులు బియ్యంతో సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు మంచి భోజనం అందించే అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు. దీనికి ముఖ్యమంత్రి సుముఖత వ్యక్తం చేశారు.

దేవాలయాల కమిటీలు, ఆసుపత్రులకు సంబంధించిన కమిటీలను భర్తీ చేయలేదని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక నాయకుడు ప్రస్తావించారు. ఇప్పటికే కొన్ని చొట్ల కమిటీలు వేశామని, లేనివాటికి వెంటనే చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. మధ్యాహ్న పథకానికి నాణ్యమైన బియ్యం ఇవ్వాలని, రాష్ట్రవ్యాప్తంగా ఒక డ్రైవ్‌ నిర్వహించి లైసెన్సలు అందించాలని వచ్చిన సూచనను కూడా బాబు ఆమోదించారు.

తమిళనాడు ప్రభుత్వం నిర్వహిస్తున్న అమ్మ క్యాంటీన్ల వంటివాటిని ఇక్కడ కూడా ప్రారంభించాలని కోరారు. పార్టీ అనుబంధ సంఘాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని చిత్తూరుకు చెందిన ఓ బీసీ సెల్‌ నాయకుడు సీఎంకు తెలిపారు. టీటీడీ అధ్వర్యంలో ప్రతి జిల్లాలో ఒక చోట సామూహిక వివాహాలను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి విజ్ఞప్తి చేశారు.

శ్రీకాకుళం జిల్లా పరిషత చైర్మన ధనలక్ష్మి మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకానికి ఎక్కువ ప్రచారం కల్పించాలని కోరారు. సమావేశంలో జన్మభూమి కమిటీలపై ఫిర్యాదులు అధికంగా వచ్చాయి.

English summary
Andhra Pradesh CM Nara Chandrababu Naidu took Telugu desam party activists opinion on various issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X