ఢిల్లీలో లాబీయింగ్ కోసం రాష్ట్రం ఖాళీ! (పిక్చర్స్)

హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ ముసాయిదా బిల్లు పైన అభిప్రాయం, అభ్యంతరాలు, సవరణలు, అఫిడవిట్లు ఢిల్లీకి చేరుకోవడంతో ఇరు ప్రాంతాల అన్ని పార్టీల నాయకులు ఢిల్లీకి క్యూ కట్టారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇప్పటికే ఢిల్లీలో జాతీయ స్థాయి నేతలను కలుస్తున్నారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం ఉదయం ఢిల్లీకి బయలుదేరారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు.

కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు చెందిన ఇరు ప్రాంతాల నేతలు, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ఢిల్లీలో ఉన్నారు. ఇంకొందరు నేతలు ఢిల్లీకి వెళ్తున్నారు. అందరు హస్తిన బాట పట్టడంతో సచివాలయం ఖాళీ అయింది.

రాజ్‌తో చంద్రబాబు

రాజ్‌తో చంద్రబాబు

సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి న్యూఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నివాసం వద్ద ఆందోళన చేపట్టి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని తెలుగుదేశం అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సవాలు చేశారు. ఆయన సోమవారం బిజెపి జాతీయ అధ్యక్షులు రాజ్ నాథ్ సింగ్‌ను కలిశారు.

తెలంగాణ నేతలు

తెలంగాణ నేతలు

రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో సీమాంధ్ర ప్రజాప్రతినిధులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించబోవని తెలంగాణ ప్రాంత మంత్రులు అభిప్రాయపడ్డారు.

తెలంగాణ మంత్రులు

తెలంగాణ మంత్రులు

ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీని కాంగ్రెస్ అధినాయకత్వం ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే నెరవేర్చుతుందని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ హామీ ఇచ్చినట్టు టి నేతలు తెలిపారు.

డికె అరుణ

డికె అరుణ

రాజ్యాంగంలోని మూడవ అధికరణ సాయంతో తెలంగాణ రాష్ట్ర ఎర్పాటుకు కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని మంత్రి డికె అరుణ చెప్పారు.

టి నేతలు

టి నేతలు

రాష్ట్ర విభజన బిల్లును శాసనసభ తిరస్కరించడంతో తలెత్తిన పరిణామాలపై దిగ్విజయ్ సింగ్‌తో సంప్రదింపులు జరిపేందుకు తెలంగాణ మంత్రులు ఢిల్లీకి వచ్చారు.

జాతీయ నేతలతో..

జాతీయ నేతలతో..

తెలంగాణకు మద్దతు కూడగట్టేందుకు తెలంగాణ ప్రాంత మంత్రులు పలువురు జాతీయ నాయకులను, పలు జాతీయ పార్టీల అధ్యక్షులను సోమవారం కలిశారు.

తెలంగాణ

తెలంగాణ

ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీని కాంగ్రెస్ అధినాయకత్వం ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే నెరవేర్చుతుందని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ హామీ ఇచ్చినట్టు టి నేతలు తెలిపారు.

జాతీయ నాయకులతో...

జాతీయ నాయకులతో...

తెలంగాణకు మద్దతు కూడగట్టేందుకు తెలంగాణ ప్రాంత మంత్రులు పలువురు జాతీయ నాయకులను, పలు జాతీయ పార్టీల అధ్యక్షులను సోమవారం కలిశారు.

కెసిఆర్, అజిత్ సింగ్

కెసిఆర్, అజిత్ సింగ్

తెలంగాణకు మద్దతు కూడగట్టేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆర్ఎల్డీ అధ్యక్షులు అజిత్ సింగ్‌ను కలిశారు.

కెసిఆర్, అజిత్ విలేకరుల సమావేశం

కెసిఆర్, అజిత్ విలేకరుల సమావేశం

ప్రతికూల పరిస్థితుల్లో కూడా తెలంగాణ సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అభినందనీయులు అని రాష్ట్రీయ లోక దళ్ (ఆర్ఎల్డీ) అధ్యక్షులు అజిత్ సింగ్ సోమవారం అన్నారు.

కెసిఆర్, అజిత్ భేటీ

కెసిఆర్, అజిత్ భేటీ

పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు తాము మద్దతిస్తామని, త్వరలో తెలంగాణ సాకారం అవనుందని, ఉత్తర ప్రదేశ్‌ను కూడా నాలుగు రాష్ట్రాలుగా చేయాలని అజిత్ సింగ్ డిమాండ్ చేశారు.

కెసిఆర్ లెఫ్ట్

కెసిఆర్ లెఫ్ట్

తెలంగాణకు మద్దతు కూడగట్టేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు జాతీయ స్థాయి నాయకులను కలుస్తున్నారు.

కెసిఆర్ విలేకరుల సమావేశం

కెసిఆర్ విలేకరుల సమావేశం

తెలంగాణకు మద్దతు కూడగట్టేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు జాతీయ స్థాయి నాయకులను కలుస్తున్నారు.

చంద్రబాబు 1

చంద్రబాబు 1

పార్లమెంట్‌లో సోనియాను చూసి భయపడి టిడిపి ఎంపీల వెనుక నిలబడి సమైక్య నినాదాలు చేసిన జగన్ ఇప్పుడు తనను తాను ‘సమైక్యవాద చాంపియన్'గా ప్రచారం చేసుకోవడం ప్రజలను మోసగించటమేనని బాబు అన్నారు. శరద్ యాదవ్‌తో చంద్రబాబు, టిడిపి నేతల దృశ్యం.

చంద్రబాబు 2

చంద్రబాబు 2

విభజన విషయంలో నిన్న మొన్నటి వరకూ జగన్‌ను అడ్డం పెట్టుకుని నాటకాలాడిన కాంగ్రెస్ అధినాయకత్వం ఇప్పుడు జగన్ గ్రాఫ్ పడిపోతోందని గ్రహించి కిరణ్‌ను అడ్డం పెట్టుకుని నాటకాలు ఆడుతోందని చంద్రబాబు ధ్వజమెత్తారు. శరద్ యాదవ్‌తో చంద్రబాబు, టిడిపి నేతల దృశ్యం.

విలేకరులతో...

విలేకరులతో...

విభజన బిల్లును పార్లమెంట్‌లో ప్రతిపాదించనున్న నేపథ్యంలో చంద్రబాబు సోమవారం ఢిల్లీకి చేరుకుని జాతీయ పార్టీల నాయకులతో సమావేశమయ్యారు.

జాతీయ స్థాయి నాయకులతో...

జాతీయ స్థాయి నాయకులతో...

రాష్ట్రపతిని కలిసే ముందు ఆయన బిజెపి అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, జెడి(యు) అధ్యక్షుడు శరద్ యాదవ్ తదితరులతో సమాలోచనలు జరిపారు. రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశం ముగిసిన తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.

మీడియాతో..

మీడియాతో..

రాష్ట్రంలో రెండు ప్రాంతాలకు సమన్యాయం జరిగేట్లు తగిన చర్యలు తీసుకుంటామని రాజ్‌నాథ్ సింగ్ హామీ ఇచ్చినట్లు చంద్రబాబు తెలియజేశారు.

రాజ్ నాథ్

రాజ్ నాథ్

రాష్ట్రపతిని కలిసే ముందు ఆయన బిజెపి అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, జెడి(యు) అధ్యక్షుడు శరద్ యాదవ్ తదితరులతో సమాలోచనలు జరిపారు. రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశం ముగిసిన తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+