హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'అందాల శ్రీమతులకు' ఆహ్వానం (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రకృతిలో దేవుడు సృష్టించిన వాటన్నింటిలోకీ స్త్రీయే అద్భుతమని మిసెస్ ఇండియా ఏషియా ఇంటర్నేషనల్ 2015 వాలెటీనా అన్నారు. నక్షత్ర మీడియా, యువ మీడియా సంయుక్తంగా నిర్వహించబోయే మిసెస్ తెలంగాణ 2015 అందాల పోటీ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం గోల్కొండ హోటల్‌లో శుక్రవారం జరిగింది.

సినీ తారలు షాలిని, శ్రీముఖి, నీలిమా నాయుడుతో కలిసి ఆమె పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వాలెంటినా మాట్లాడారు. అందాల పోటీలు స్త్రీల అందాన్నే కాదు, సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని అన్నారు.

మిసెస్ తెలంగాణ కార్యక్రమం ఆడపడుచుల అలంకరణతోపాటు ఈ ప్రాంత సాంస్కృతిక వైభవాన్ని చాటేలా ఉండాలని అన్నారు. నిర్వాహకులు లక్ష్మి మాట్లాడుతూ జూలైలో అన్ని జిల్లాల్లో ఆడిషన్స్ నిర్వహించి 20 మందిని ఫైనల్స్‌కు ఎంపిక చేస్తామన్నారు.

తెలంగాణ ప్రతిష్ట పెంచేందుకు...

తెలంగాణ ప్రతిష్ట పెంచేందుకు...

తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను మరింతగా పెంచేందుకు మిసెస్ తెలంగాణ - 215 అందాల పోటీని నిర్వహిస్తున్నట్లు నక్షత్ర మీడియా మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మి చెప్పారు.

వేర్వేరుగా పోటీలు...

వేర్వేరుగా పోటీలు...

40 సంవత్సరాలలోపు మహిళలు, 40 సంవత్సరాలకు పైబడిన మహిళలకు వేర్వేరుగా అందాల పోటీ నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.

క్లాసిక్ మిసెస్...

క్లాసిక్ మిసెస్...

మిసెస్ తెలంగాణ విభాగంలో 40 ఏళ్ల లోపు మహిళలకు, క్లాసిక్ మిసెస్ తెలంగాణ విభాగంలో 40 ఏళ్లవయస్సు పైబడిన మహిళలకు పాల్గొనే అవకాశం ఉంటుంది.

పది జిల్లాల మహిళలు..

పది జిల్లాల మహిళలు..

తెలంగాణలోని పది జిల్లాల మహిళల పాల్గొనే మిసెస్ తెలంగాణ పోటీల్లో ఫైనల్ రౌండ్‌కు 30 మంది అర్హత సాధిస్తారని లక్ష్మి అన్నారు. వారిలోంచి మిసెస్ తెలంగాణను నిర్ణయిస్తారు.

తొలిసారిగా...

తొలిసారిగా...

తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా మహిళల కోసం అందాల పోటీలు మిసెస్ తెలంగాణ - 2015 పేరు మీద జరగబోతున్నాయి.

నైపుణ్యం ప్రదర్శించుకునే అవకాశం

నైపుణ్యం ప్రదర్శించుకునే అవకాశం

తమలో దాగి ఉన్న నైపుణ్యాన్ని ప్రదర్సించుకునే అవకాశం ఈ పోటీలు కల్పిస్తున్నాయని నిర్వాహకులు, విజిత్ చెప్పారు.

యువతకు స్ఫూర్తి..

యువతకు స్ఫూర్తి..

దేశ భవిష్యత్తును మార్చే తెలంగాణ యువతకు స్ఫూర్తి కలిగించే విధంగా ఈ అందాల పోటీలకు శ్రీకారం చుట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఆడిషన్స్ ఇలా..

ఆడిషన్స్ ఇలా..

జులై 5వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఆడిషన్స్ నిర్వహించి ఫైనల్‌కు 30 మందిని ఎంపిక చేస్తామని నిర్వాహకులు తెలిపారు.

10 రోజులు తర్ఫీదు

10 రోజులు తర్ఫీదు

ఫైనల్స్‌కు ఎంపిక చేసినవారికి పది రోజుల పాటు ఆయా ఆంశాల్లో శిక్షణ ఇచ్చి ఫైనల్స్‌ను హైటెక్స్‌లో నిర్వహిస్తామని నిర్వాహకులు చెప్పారు.

అరుదైన అవకాశం

అరుదైన అవకాశం

మిసెస్ తెలంగాణ - 2015 పోటీలు ఆడవాళ్లకు అరుదైన అవకాశమని తారలు అన్నారు. ఈ పోటీలు కొత్త ఉత్సాహాన్ని నింపుతాయని అన్నారు.

English summary
Mrs Telangana - 2015 poster has been released at Nakshatra hotel in Hyderabad
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X