వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డిప్యూటీ సిఎం వాహనం ఢీకొన్న మహిళ మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

వరంగల్: తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండ-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై యశ్వంతాపురం సమీపంలో గత నవంబర్‌లో డిప్యూటీ సీఎం రాజ య్య ఎస్కార్ట్‌ వాహనం ఢీ కొన్న సంఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న మహిళ శుక్రవారం మృతి చెందింది. గత నవంబర్‌ 30న డిప్యూటీ సీఎం జనగామలో ఓ కార్య క్రమానికి హాజరై తిరిగి జిల్లా కేంద్రానికి వస్తుండగా యశ్వంతాపురం జిప్స్‌ కళాశాల సమీపంలో టైర్‌ పంక్చరైన ఎస్కార్ట్‌ వాహనం అదుపు తప్పింది. దీంతో నిలిచి ఉన్న బైక్‌ను, ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టింది.

ఈ ఘటనలో ఎస్కార్ట్‌ పోలీసులతో పాటు కారులో ఉన్న ముగ్గురికి, బైక్‌పై ఉన్నమరో ఇద్దరికిగా యాలయ్యాయి. నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రేమ్‌టాకీసు ఏరియాకు చెందిన సాధిక్‌ఉన్నీ సా బేగం (36)తన భర్త గులాం గౌస్‌, కూతురితో కలిసి కాజీపేటలోని సోదరి ఇంటికి వచ్చి తిరిగి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో సాధి క్‌ ఉన్నీసా బేగంను మొదట కేర్‌ ఆస్పత్రిలో చేర్పించారు.

Deputy CM’s convoy accident victim dies

కేర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయిన తర్వాత ఆమె వరంగల్‌లోని ఎఫ్ఎస్ఐ కాలనీలోని బంధువు ఇంట్లో ఉంటోంది. అయితే, శుక్రవారం తెల్లవారు జామను శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడడంతో వెంటనే హన్మకొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. రోడ్డు ప్రమాదంలో పక్కటెముకల్లో రక్తం గడ్డం కట్టడంతో పాటు ఊపిరితితుల్లోకి రక్తం వెళ్లడంతో ఆమె మృతి చెందినట్లు వైద్యులు చెప్పారని గౌస్ అన్నారు.

మృతురాలి కూతురు షహాజా దీవమోహ్ వీస్ (7) తల్లి మృత దేహాన్ని చూసి నిద్రపోయిందా అని అడగడం అందరినీ కలచివేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఎం.కరుణాకర్‌ తెలిపారు. ప్రమాద సమయంలో ఎస్కార్ట్‌ వాహనం డ్రైవర్‌ స్వామిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

English summary
A month after Telangana deputy chief minister Dr T Rajaiah's official convoy rammed into a car and grievously injured a few passengers, one of them died in a hospital, triggering severe backlash from minority and dalit groups, who have called the minister "insensitive and inhuman."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X