ఎపి బిజెపిలో చంద్రబాబు చిచ్చు: నేతల మధ్య విభేదాలు

Posted By:
Subscribe to Oneindia Telugu
  బిజెపిలో చంద్రబాబు చిచ్చు

  అమరావతి: ఆంధ్రప్రదేశ్ బిజెపి నాయకుల్లో విభేదాలు స్పష్టంగా పొడసూపుతున్నాయి. పోలవరంపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరి విషయంలో ఓ వర్గం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అనుకూలంగా వ్యవహరిస్తుండగా, మరో వర్గం చంద్రబాబును తప్పు పట్టే పనికి పూనుకుంది.

  పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు సూచనను అనుసరిస్తూ పార్లమెంటు సభ్యుడు హరిబాబు వర్గం వ్యవహరిస్తుండగా, మరో వర్గం అందుకు భిన్నమైన వైఖరి తీసుకుంది. సోము వీర్రాజు, పురంధేశ్వరి వంటి బిజెపి నేతలు పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబును తప్పు పడుతూ తమ కేంద్ర ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తున్నరాు.

   టిడిపి నిప్పులు చెరిగిన సోము వీర్రాజు

  టిడిపి నిప్పులు చెరిగిన సోము వీర్రాజు

  తెలుగుదేశం పార్టీ ప్రతిసారీ పొత్తు పేరుతో తమను మోసం చేస్తోందని, ఇకపై ఆటలు సాగవని ఇప్పుడున్నది నరేంద్ర మోడీ అని, తమ మంత్రి మాణిక్యాలరావుకు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం గురించి తమ పార్టీని ఎందుకు పట్టించుకోలేదని, ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారని ఆయన ప్రశ్నించారు. బిజెపితో పొత్తు ఉండదని చంద్రబాబును చెప్పమనండని ఆయన అన్నారు.

   సోము వీర్రాజు వ్యాఖ్యకు హరిబాబు కౌంటర్

  సోము వీర్రాజు వ్యాఖ్యకు హరిబాబు కౌంటర్

  పొత్తులపై ఎవరు మాట్లాడినా వాటికి విలువలేదని, వ్యక్తుల మధ్య భిన్నాభిప్రాయాలున్నా పార్టీ అభిప్రాయమే అంతిమమని బిజెపి ఎంపి హరిబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదేనని కేంద్ర మంత్రి గడ్కరీ స్పష్టంగా చెప్పారని కూడా ఆయన అన్నారు. సోము వీర్రాజు వ్యాఖ్యలను హరిబాబు తేలిగ్గా కొట్టి పారేశారు.

  ఢిల్లీ పర్యటనలోనూ విభేదాలు...

  ఢిల్లీ పర్యటనలోనూ విభేదాలు...

  బిజెపి నేతల మధ్య విభేదాలు ఢిల్లీ పర్యటనలో మరోసారి బయటపడ్డాయి. చంద్రబాబు సూచించిన మేరకు పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని కోరేందుకు బిజెపిలోని ఓ వర్గం మాత్రమే ఢిల్లీకి వెళ్లింది. ఇళ్ల నిర్మాణాల్లో తమకు వాటా కావాలని బిజెపి ఎమ్మెల్సీలు చంద్రబాబును ఇటీవల కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు వారికి ఓ సూచన చేశారు. ఢిల్లీకి వెళ్లి పోలవరంపై కేంద్రం మీద ఒత్తిడి తేవాలని ఆయన చెప్పారు.

   బాబు సూచన మేరకు ఓ వర్గం...

  బాబు సూచన మేరకు ఓ వర్గం...

  చంద్రబాబు సూచన మేరకు బిజెపి నేతలు బుధవారం డిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి గడ్కరీని కలిశారు. ఈ బృందంలో సోము వీర్రాజుతో పాటు పురంధేశ్వరి, కన్నా లక్ష్మినారాయణ, కావూరి సాంబశివరావు లేరు. సోము వీర్రాజును తాము పిలిచామని, రాలేనని ఆయన చెప్పారని, మిగిలిన వారిని తాము పిలువవలేదని అంటున్నారు.

   పురంధేశ్వరి, తదితరులు ఇలా..

  పురంధేశ్వరి, తదితరులు ఇలా..

  పోలవరం విషయంపైనే పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ ఇటీవల ఢిల్లీ వెళ్లి గడ్కరీని కలిశారు. ఈ సమయంలో గడ్కరి జలవనరుల శాఖ ఉన్నతాధికారులను పిలిపించి, పోలవరం వాస్తవ స్థితిగతులను వారికి చెప్పించారు. ఆ బృందంలో హరిబాబు బృందం లేదు.

   బిజెపిలో ఇలా రెండు వర్గాలు..

  బిజెపిలో ఇలా రెండు వర్గాలు..

  ఆంధ్రప్రదేశ్ బిజెపిలో స్పష్టంగా రెండు వర్గాలు ఏర్పడ్డాయి. హరిబాబు, మంత్రి కామినేని, విష్ణుకుమార్‌రాజు, ఆకుల సత్యనారాయణ ఒక వర్గం వ్యవహరిస్తున్నారు. వీరు చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం ఉంది. సోమువీర్రాజు, మంత్రి మాణిక్యాలరావు, పురంధేశ్వరి, కన్నా, కావూరి, సురేష్‌రెడ్డి మరో వర్గంగా వ్యవహరస్తున్నారు. వీరిపై చంద్రబాబు వ్యతిరేక వర్గంగా ముద్ర పడింది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Andhra Pradesh BJP is split into two groups on Polavaram issue. One is supporting CMM Nara Chandrababu Naidu, another is opposing.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి