గూగుల్‌కు తెలుగు విద్యార్థి ఎంపిక, ఏడాదికి రూ.75 లక్షలు
హైదరాబాద్: ప్రముఖ సెర్చింజన్ గూగుల్ సంస్థ సోమవారం ముంబైలో నిర్వహించిన క్యాంపస్ నియామకాల్లో ఖమ్మం జిల్లా విద్యార్థిని తోటకూరి శ్రీమేఘన ఎంపికయ్యారు. ఆమెకు ఏడాదికి రూ.75 లక్షల వేతనం ఈ సంస్థ ఇవ్వనుంది.

గూగుల్ సంస్థ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన రాత పరీక్షల్లో శ్రీమేఘన 57వ ర్యాంకు, జాతీయస్థాయిలో 27వ ర్యాంకును సాధించారు. ఈ మేరకు ముంబైలో ఆ సంస్థ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆమె ఎంపికయ్యారు. శ్రీమేఘన ప్రస్తుతం ముంబై ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చివరి సంవత్సరం చదువుతున్నారు.
2010లో ఐఐటీ ప్రవేశ పరీక్షల్లో జాతీయస్థాయిలో 52వ ర్యాంకును సాధించారు. తండ్రి తోటకూరి శ్రీనివాస్ చెన్నైలోని ఎన్టీపీసీలో అసిస్టెంట్ ఇంజినీరుగా పని చేస్తున్నారు. తల్లి వాణి రామగుండంలో ప్రభుత్వ ఉపాధ్యాయినిగా పని చేస్తున్నారు. వీరి స్వగ్రామం ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలం జుజ్జుళ్లరావుపేట.












Click it and Unblock the Notifications