నల్లకుబేరుల్లో ఎపి నేతలు: సత్యప్రభ తొలి టార్గెట్

హైదరాబాద్‌): నల్లధనం కూడబెట్టినవారిపై కేంద్రం తీవ్రమైన చర్యలకు ఒడిగట్టటింది. ఈ నెలాఖరులోపు స్పందించాలని నల్లకుబేరులకు కేంద్రం ఇచ్చిన పిలుపునకు స్పందించనివారిపై ఆదాయం పన్ను శాఖ చర్యలకు దిగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఐదుగురు రాజకీయ నాయకులు జాబితాలో ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఓ ప్రముఖ తెలుగు దినపత్రికలో వార్తాకథనం ప్రచురితమైంది.

ఆ పత్రికలో వచ్చిన వార్తాకథనం ప్రకారం - తొలి దశలో కొందరు కీలక వ్యక్తులను ఐటి శాఖ లక్ష్యం చేసుకున్నట్లు తెలుస్తోంది. తొలి దశలో అధికార టీడీపీ ఎమ్మెల్యే డీకే సత్యప్రభపై ఐటి శాఖ దృష్టి పెట్టినట్లు సమాచారం.

చిత్తూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సత్యప్రభ మాజీ ఎంపీ డీకే ఆదికేశవులు నాయుడి సతీమణి. ఈ కుటుంబానికి దక్షిణాది రాష్ట్రాల్లో భారీగా వ్యాపారాలున్నాయి. ఆదాయపన్ను శాఖకు చూపిన లెక్కల కంటే ఆస్తులు ఎక్కువగా ఉన్నాయని ఆదాయం పన్ను శాఖ అధికారులు ఆమెకు సంబంధించిన నివాసాలు, కార్యాలయాల్లో శుక్రవారం ఏకకాలంలో దాడులు నిర్వహించి సోదాలు చేపట్టారు.

IT department eyes on AP leaders: Satya Prabha first target

బెంగళూరు, హైదరాబాద్‌, నిజామాబాద్‌, జహీరాబాద్‌, చెన్నై, పాండిచ్చేరిల్లో సోదాలు నిర్వహించి పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నల్లధనాన్ని వెలికితీస్తామనే కేంద్ర ప్రభుత్వ ప్రకటనలో భాగంగా అక్రమ సంపాదన ఉన్నవారు ఈ నెల 30వ తేదీలోపు తమ ఆదాయమొత్తంలో 45శాతం పన్ను చెల్లిస్తే ఎలాంటి విచారణలు, ప్రాసిక్యూషన్‌ ఉండ బోవని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే.

గతంలో ఒకసారి స్వచ్ఛంద ఆదాయ వెల్లడి కార్యక్రమాన్ని చేపట్టినట్లుగానే ఈ దఫా ఆదాయ ప్రకటన పథకాన్ని ( ఐడీఎస్‌) అమల్లోకి తెచ్చారు. అయితే, దేశవ్యాప్తంగా ఈ పథకానికి ఆశించిన స్థాయిలో ప్రతిస్పందన రాకపోవడంతో అక్రమ సంపాదనపరులను దారిలోకి తెచ్చుకోవడానికి ముందస్తు దాడుల వ్యూహాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.. స్విస్‌ బ్యాంకులో ఖాతాలున్నాయని ప్రచారం జరుగుతున్నవారిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు.

సిఆర్‌డిఎ పరిధిలో భూములు కొన్నవారిపై..

ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినంతవరకూ సీఆర్‌డీఏ పరిధిలో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసిన వారిపై కూడా ఆదాయం పన్ను శాఖ అదికారులు దృష్టి పెట్టినట్లు ఆ దినపత్రిక రాసింది. స్థానిక మార్గాల ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా ఢిల్లీ నుంచే కొన్ని పేర్లను ఏపీలోని ఆదాయ పన్ను శాఖ అధికారులకు పంపి దాడులు, సోదాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+