వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుతో పవన్ కళ్యాణ్ భేటీ?: జనసేన సీట్లు ఇవే

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొత్తు కోసం అటు తెలుగుదేశంతోనూ ఇటు బిజెపితోనూ చర్చలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్టీలను దెబ్బ తీయడమే లక్ష్యంగా ముందుకు వస్తున్న ఆయన కొద్దిపాటి సీట్లకు కూడా అంగీకరించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్‌ చంద్రబాబునాయుడితో పవన్‌ కళ్యాన్‌ సమావేశం అయినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ భేటీ అనంతరం పవన్‌ కళ్యాన్‌ ఢిల్లీ బయలుదేరి వెళ్లినట్లు చెబుతున్నారు.

ఢిల్లీలో బిజెపి అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్‌తో మాట్డాడినట్లు తెలుస్తోంది. బిజెపి అగ్రనాయకులతో ఫోన్‌లో మాట్లాడారా లేక స్వయంగా కలిశారా తెలియదు. మోడీతో మాత్రం రెండు మూడు రోజుల్లో సమావేశమయ్యే అవకాశాలున్నాయని కూడా చెబుతున్నారు. బిజెపి అగ్రనేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం చంద్రబాబు వ్యూహంలో భాగంగానే జరుగుతన్నట్లు తెలుస్తోంది.

Jana sena chief Pawan Kalyan has met Telugudesam party president Nara Chandrababu Naidu

సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ నామరూపాల్లేకుండా పోయిందని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ఎదుర్కోవడమే ముఖ్యమని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. పవన్ కళ్యాణ్ కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. రెండు లేదా మూడు పార్లమెంటు 14 అసెంబ్లీ స్థానాలు ఇస్తే తెలుగుదేశం పార్టీతో అవగాహనకు ఆయన వచ్చే అవకాశం ఉందని అనుకోగా ఇప్పుడు చర్చల అనంతరం వ్యూహం మారినట్లుగా కనిపిస్తున్నది. తాను కోరిన రెండు పార్లమెంటు స్థానాల్లో విజయవాడ స్థానాన్ని ఇచ్చేందుకు చంద్రబాబునాయుడు ససేమిరా అంగీకరించకపోవడంతో ఏలూరు పార్లమెంటు స్థానం మరో రెండు పార్లమెంటు స్థానాలు కావాలని పవన్‌ కోరినట్లు చెబుతున్నారు.

పవన్ అసెంబ్లీ సీట్లు ఇవే

అదే సమయంలో అసెంబ్లీ సీట్లు ఎక్కువ ఇచ్చేందుకు కూడా చంద్రబాబు నాయుడు అంగీకరించలేదని అంటున్నారు. 14 అసెంబ్లీ స్థానాల డిమాండ్‌ను 10 స్థానాలుకు పవన్‌ తగ్గించుకున్నట్లు తెలిసింది. సీమాంధ్రలో కాకినాడ, కొత్తపేట, తణుకు, అమలాపురం, పాలకొల్లు, నర్సాపురం, భీమవరం, ఏలూరు, విజయవాడ, తెనాలి అసెంబ్లీ నియోజకవర ా్గలను లక్ష్యంగా చేసుకుని పవన్‌ కదులుతున్నట్లు సమాచారం. సీమాంధ్రలో ఏలూరు పార్లమెంటుతో పాటు కాకినాడ, మచిలీపట్నం పార్లమెంటు స్థానాలు కోరే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. అయితే దీనిపై ఇంకా కచ్చితమైన నిర్ణయానికి ఇరు పార్టీలు రాలేదని తెలిసింది.

English summary

 It is said that Jana sena chief Pawan Kalyan has met Telugudesam party president Nara Chandrababu Naidu and discussed about the seat sharing formula.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X