అధిష్టానం నో చెప్పినా: టి బిల్లుపై కిరణ్ పావులు

17 నుంచి శాసన సభ సమావేశాలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో బిల్లు వల్ల కలిగే నష్టాలను ఎలా వివరించాలి? బిల్లును ఎందుకు తిరస్కరిస్తున్నామో? సవివరంగా చెప్పేందుకు అవసరమైన పాయింట్లను ఆయన మంత్రులకు వివరిస్తున్నారట. పండుగ సమయంలో ఎవరు ఎక్కడున్నా, ఇదే అంశానికి ప్రాధాన్యతనిస్తూ ఇతరులతో సమన్వయం చేసుకోవాలని చెబుతున్నారట.
తెలంగాణ బిల్లుపై చర్చకు మరికొద్దికాలం గడువు కావాలంటూ కేంద్రాన్ని కోరాలని ముఖ్యమంత్రి భావిస్తున్నప్పటికీ కేంద్రం ఎంత వరకు సానుకూలంగా స్పందిస్తుందోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కారణంగా గడువులోపే చర్చ ద్వారా బిల్లును సమర్ధవంతంగా ఎదుర్కొనాలని ఆయన యోచిస్తున్నారు. 17నుంచి ప్రారంభమయ్యే మలి విడత సమావేశాల్లో ఐదు లేదా ఆరు రోజులు మాత్రమే చర్చకు అవకాశం ఉంటుంది.
ఆదివారం కూడా సమావేశాలు నిర్వహించేలా చివరి నిముషంలో నిర్ణయం తీసుకుంటే ఏడు రోజులు అందుబాటులోకి వస్తాయి. ఈ కారణంగా మొత్తం సభ్యులతో మాట్లాడించేందుకు ప్రయత్నించాలని, లేదా సంఖ్యా బలంగా ఎక్కువ మందితో మాట్లాడించే అవకాశం కాంగ్రెస్‌కే ఉన్నందున, వీలైనంత వరకూ సీమాంధ్ర సభ్యులతో మాట్లాడించే దిశలో ఆలోచనలు చేస్తున్నారట. దీనికి తెలంగాణ కాంగ్రెస్ నుంచి తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమవుతాయి.
ఈ నేపథ్యంలో అవసరమైతే అందుబాటులో ఉన్న సీమాంధ్రులతోనే బలంగా గొంతు వినిపించేలా చూడటం ప్రధాన కర్తవ్యంగా ముఖ్యమంత్రి భావిస్తున్నారట. మాట్లాడేందుకు అవకాశం రాని వారు ఎలాగూ అఫిడవిట్లు ఇస్తారని, వాటిని కూడా పరిగణనలోకి తీసుకునేలా కేంద్రంపై వత్తిడి తీసుకురావాలని కిరణ్ యోచిస్తున్నారు.












Click it and Unblock the Notifications