షా..: పార్టీలో మోడీ పట్టు, ప్రత్యర్థులకు నో (పిక్చర్స్)
న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీని క్రమంగా తన చేతుల్లోకి తీసుకుంటున్నారు! మోడీ అటు లోకసభలోను ఇటు రాజ్యసభలోనూ బీజేపీ సభాపక్ష నేతగా వ్యవహరించనున్నారు. రెండు సభల్లోనూ ప్రధాని సభాపక్ష నేతగా వ్యవహరించడం అరుదుగా చోటుచేసుకునే సంఘటన.
బీజేపీ పార్లమెంటరీ పార్టీని శనివారం పూర్తిస్థాయిలో పునర్‌వ్యవస్థీకరించారు. నూతన కమిటీ ప్రకారం బీజేపీ ఉపనేతలుగా లోకసభలో రాజ్‌నాథ్ సింగ్, రాజ్యసభలో అరుణ్ జైట్లీ వ్యవహరిస్తారు. మరో సీనియర్ వెంకయ్య నాయుడు పార్లమెంటులో ప్రభుత్వ చీఫ్ విప్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు.
ప్రభుత్వం తరఫున లోకసభలో డిప్యూటీ చీఫ్ విప్‌గా సంతోష్ గంగ్వార్, రాజ్యసభలో డిప్యూటీ చీఫ్ విప్‌గా ప్రకాశ్ జవదేకర్‌కు బాధ్యతలు అప్పగించారు. పార్టీ తరఫున చీఫ్ విప్‌లుగా లోకసభలో అర్జున్‌రామ్, రాజ్యసభలో అవినాశ్ రాయ్ ఖన్నా వ్యవహరిస్తారు. వీరితోపాటు మరో 13 మందికి లోకసభలో విప్ బాధ్యతలు అప్పగించగా రాజ్యసభలో ముగ్గురు నేతలకు విప్ బాధ్యతలు అప్పగించారు.

నరేంద్ర మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ అటు లోకసభలోను ఇటు రాజ్యసభలోనూ బీజేపీ సభాపక్ష నేతగా వ్యవహరించనున్నారు. రెండు సభల్లోనూ ప్రధాని సభాపక్ష నేతగా వ్యవహరించడం అరుదుగా చోటుచేసుకునే సంఘటన.

రాజ్‌నాథ్ సింగ్
బీజేపీ పార్లమెంటరీ పార్టీని శనివారం పూర్తిస్థాయిలో పునర్‌వ్యవస్థీకరించారు. నూతన కమిటీ ప్రకారం బీజేపీ ఉపనేతలుగా లోకసభలో రాజ్‌నాథ్ సింగ్, రాజ్యసభలో అరుణ్ జైట్లీ వ్యవహరిస్తారు.

అరుణ్ జైట్లీ
బీజేపీ పార్లమెంటరీ పార్టీని శనివారం పూర్తిస్థాయిలో పునర్‌వ్యవస్థీకరించారు. నూతన కమిటీ ప్రకారం బీజేపీ ఉపనేతలుగా లోకసభలో రాజ్‌నాథ్ సింగ్, రాజ్యసభలో అరుణ్ జైట్లీ వ్యవహరిస్తారు.

వెంకయ్య నాయుడు
బీజేపీ పార్లమెంటరీ పార్టీని శనివారం పూర్తిస్థాయిలో పునర్‌వ్యవస్థీకరించారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పార్లమెంటులో ప్రభుత్వ చీఫ్ విప్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు.

అమిత్ షా
తన సన్నిహిత అనుచరుడు అమిత్ షాకు భారతీయ జనతా పార్టీ సారథ్య బాధ్యతలు దక్కేలా నరేంద్ర మోడీ మంత్రాంగం నడిపి.. ఆయనకు అధ్యక్ష బాధ్యతలు వచ్చేలా చూశారు.

ఎల్‌కే అద్వానీ
ఇప్పుడు పార్లమెంటరీ పునర్వ్యవస్థీకరలో... తనకు సవాళ్లు విసిరే అవకాశం ఉన్న పార్టీలోని ప్రత్యర్థి వర్గాన్ని నరేంద్ర మోడీ పక్కన పెట్టారు. పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ వర్గాన్ని మోడీ పక్కన పెట్టారు.

సుష్మా స్వరాజ్
ఎల్‌కే అద్వానీ వర్గానికి చెందిన నేతగా భావిస్తున్న సుష్వా స్వరాజ్‌కు మోడీ మొండి చేయి చూపారు. గత లోకసభలో సుష్మాస్వరాజ్ బీజేపీ నేతగా, ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్నారు. ఆమెతో పాటు మురళీ మనోహర్ జోషీ, కల్రాజ్ మిష్రా, యశ్వంత్ సిన్హాలను పక్కన పెట్టారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications