నిజాయితీ, ముక్కుసూటితనం: మోడీపై ఒబామా ప్రశంస

వాషింగ్టన్/న్యూఢిల్లీ: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిజాయితీపరుడని, ముక్కుసూటిగా మాట్లాడే రాజకీయ నాయకుడని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అభిప్రాయపడ్డారు. భారతదేశానికి సంబంధించి స్పష్టమైన అవగాహన మోడీకి ఉందని ఒబామా భావిస్తున్నారని అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం వెల్లడించింది.

'నరేంద్ర మోడీ నిజాయతీపరుడైన రాజకీయవేత్త. వాస్తవాలపై ఆయనకు సరైన పట్టు ఉంది. భారత్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై స్పష్టమైన దార్శనికత ఆయన సొంతం' అని మోడీపై బరాక్‌ ఒబామా అభిప్రాయమని పేర్కొంది. ఎన్డీయే అధికారంలోకి వచ్చిన అనంతరం మోడీ-ఒబామా తరచుగా సమావేశమయ్యారు.

ప్యారిస్‌లో పర్యావరణ సదస్సు సందర్భంగా నవంబర్ 30న ఇరువురు నేతలు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోడీపై ఒబామా అభిప్రాయాలను 'శ్వేతసౌధం(వైట్‌హౌస్‌)' మీడియా విభాగం కార్యదర్శి జోష్‌ ఎర్నెస్ట్‌ మీడియాతో బుధవారం పంచుకున్నారు. మోడీపై ఒబామాకు అపారమైన నమ్మకముందని ఎర్నెస్ట్‌ వెల్లడించారు.

Modi is honest and a direct politician, feels Obama: White House

ఒబామా అభిప్రాయం ప్రకారం.. ‘మోడీ నిజాయతీగల, దాపరికంలేని రాజకీయవేత్త' అని పేర్కొన్నారు. దేశ ప్రగతిని అడ్డుకుంటున్న సమస్యలు, భారత్‌-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలకు ఎదురవుతున్న చిక్కులపై మోడీకి స్పష్టమైన అవగాహన ఉందన్నారు.

దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంపై మోడీకి స్పష్టమైన దార్శనికత ఉండటం... ఆయన్ను ప్రభావవంతమైన రాజకీయవేత్తగానే కాకుండా, కార్యదక్షత గల ప్రధానిగానూ చేస్తోందన్నారు. మోడీ-ఒబామా తరచుగా భేటీ కావడంతో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగయ్యాయని ఎర్నెస్ట్‌ పేర్కొన్నారు.

‘భారతదేశాన్ని ఏ స్థాయికి తీసుకువెళ్లాలని తాను కోరుకుంటున్నారో మోడీకి స్పష్టంగా తెలుసు, దీనివల్ల సమర్థవంతమైన రాజకీయ నాయకుడిగానే కాక సమర్థవంతమైన ప్రధానమంత్రి కాగలిగారు' అని ఎర్నెస్ట్ అన్నారు.

Modi is honest and a direct politician, feels Obama: White House

‘ఒబామా ప్రధాని మోడీని గౌరవిస్తారు. రాజకీయ నాయకుడిగా మోడీ నైపుణ్యాలను, సామర్థ్యాలను ఆయన అభినందిస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఉన్నతస్థాయి పదవిలో కూర్చోవడం వల్ల మోడీ చాలా జటిలమైన సవాలును స్వీకరించారు' అని ఎర్నెస్ట్ పేర్కొన్నారు. ఈ ఇద్దరు నేతలు తరచుగా భేటీ అవుతుండటాన్ని ప్రస్తావిస్తూ, అనేక సందర్భాలలో మోడీని సంప్రదించే అవకాశం ఒబామాకు వచ్చిందని ఆయన అన్నారు.

‘ఈ ఇద్దరు నేతలకు ఉన్న కలిసి పనిచేసే మంచి లక్షణానికేకాక మా ఇరు దేశాల మధ్య గల ఉమ్మడి అంశాలకు, ఆ అంశాలపై కలిసి పనిచేసేందుకు ఈ ఇద్దరు నేతలకు ఉన్న సామర్థ్యానికి, మా రెండు దేశాల ఉమ్మడి ప్రయోజనాలను నెరవేర్చే దిశగా ముందుకు సాగడానికి ఇది నిదర్శనం. ఇది మంచి విషయం' అని ఎర్నెస్ట్ వ్యాఖ్యానించారు. ఇది ఇరు దేశాలకేగాక ప్రపంచానికి మంచి విషయమని ఆయన పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+