జగన్ కంటే ఎక్కువే: కిరణ్‌రెడ్డిలా.. బాబుకు కొత్తషాక్

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏం చేయాలనే విషయమై ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ ఇప్పుటకే పలు సూచనలు చేశారు. తాజాగా, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.. జగన్ కంటే ముందడుగు వేశారు.

బాబు ప్లాన్, కేబినెట్లోకే లోకేష్: 'వైసిపి' వారికి చేయిస్తారా

ఏపీకి ప్రత్యేక హోదా సాధించాలంటే చంద్రబాబు కేంద్ర కేబినెట్లో ఉన్న తన మంత్రులచే రాజీనామా చేయించాలని, అలా కేంద్రానికి అల్టిమేటం జారీ చేస్తేనే కేంద్రం దిగి వచ్చి ప్రత్యేక హోదా ఇస్తుందని చెబుతున్నారు. ఉండవల్లి మాత్రం మరో ఆసక్తికర వ్యాఖ్య చేశారు.

New demand before Chandrababu for Special Status to Andhra Pradesh

ఓ విధంగా ఆయన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఆ విషయం ఆయన చెప్పకపోయినా ఆయన వ్యాఖ్యల్లో అది కనిపిస్తోంది. ఏపీకి హోదా రావాలంటే చంద్రబాబు సీఎం పదవి వదిలేసి, రాష్ట్రంలో, దేశంలో బాగా ప్రచారం చేస్తే కేంద్రం దిగి వస్తుందని చెబుతున్నారు.

గతంలో, కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన సమయంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ విభజనకు మద్దతుగా ఉంటే ఆయన సీఎం పదవికి రాజీనామా చేస్తారని, కాంగ్రెస్ పార్టీని వీడుతారని చాలా రోజుల పాటు వార్తలు వచ్చాయి. ఇది వాడు సంచలనం రేపింది.

ఎలా తీసుకెళ్తారో చూస్తాను: మోడీపై బాబు, ఫేస్‌బుక్‌పై ఆరా

అనంతరం సార్వత్రిక ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఆయన ముఖ్యమంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కొత్త పార్టీ స్థాపించారు. ఆ పార్టీ తరఫున ఏపీతో పాటు హైదరాబాదులోను ప్రచారం చేశారు. నాడు విభజనకు వ్యతిరేకంగా కిరణ్ రాజీనామా చేసినట్లుగా, ఇప్పుడు హోదా కోసం చంద్రబాబు రాజీనామా చేయాలని చెబుతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
New demand before Chandrababu for Special Status to Andhra Pradesh.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి