వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ కాలినడకన చుట్టివచ్చారు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు బుధవారంనాడు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రాన్ని కాలినడక చుట్టి వచ్చారు. అధికారులు వాహనం సిద్ధం చేసినప్పటికీ వద్దని చెప్పి పచ్చిన వాతావరణం మధ్య ఆయన కలియదిరిగారు.

దాదాపు అరగంట పాటు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలోని వివిధ విభాగాలను సందర్శించారు. హాస్టళ్లను, యోగా సెంటర్‌ను, జిమ్, శిక్షణా తరగతుల గదులను పరిశీలించారు. ఒకేసారి 800 మందికి వసతి కల్పించే వంశధార హాస్టల్‌ను, విఐపిలకు విడిదినిచ్చే గోదావరి అతిథి గృహాన్ని ఆయన సందర్శించారు.

దాదాపు 39 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ సంస్థలోని ప్రతి అణువు ఎంతో ఉపయోగకరంగా ఉందని కెసిఆర్ కొనియాడారు. తెలంగాణ పునర్నిర్మాణానికి ఈ సంస్థ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.

శిక్షణా తరగతులు

శిక్షణా తరగతులు

సర్పంచుల నుంచి ఐఎఎస్ అధికారల వరకు అందరికీ శిక్షణ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలోని శిక్షణ ఇవ్వాలని కెసిఆర్ నిర్ణయించారు.

ప్రేరణగా ఉంటుంది..

ప్రేరణగా ఉంటుంది..

సంస్థలోని ప్రకృతి అందాలు, సహజసిద్ధమైన వాతావరణం, మట్టి వాసన అందరికీ ప్రేరణ కలిగిస్తాయని కెసిఆర్ అన్నారు.

కార్పోరేట్ సంస్థలకు కూడా...

కార్పోరేట్ సంస్థలకు కూడా...

కార్పోరేట్ సంస్థలు తమ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడానికి ఈ సంస్థను ఉపయోగించుకోవడం ఉత్తమమని కెసిఆర్ అన్నారు.

చర్యలు తీసుకున్నా...

చర్యలు తీసుకున్నా...

తాను రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సంస్థను కాపాడడానికి ఆవరణ చుట్టూ ఫెన్సింగ, ప్రహారి ఏర్పాటు చేసినట్లు కెసిఆర్ గుర్తు చేసుకున్నారు.

హెలిపాడ్ ఏర్పాటు

హెలిపాడ్ ఏర్పాటు

మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ఆవరణలో హెలిపాడ్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నందుకు కెసిఆర్ అధికారులను అభినందించారు

సెల్ఫ్ ఫండింగ్ ఏజెన్సీగా..

సెల్ఫ్ ఫండింగ్ ఏజెన్సీగా..

దాదాపు 110 కోట్ల కార్పస్ ఫండ్‌తో 10 కోట్ల రూపాయల బ్యాలెన్స్‌తో ఈ సంస్థ సెల్ఫ్ ఫండింగ్ ఏజెన్సీగా రూపుదిద్దుకోవడం పట్ల కెసిఆర్ హర్షం వ్యక్తం చేశారు.

శిక్షణా తరగతులకు...

శిక్షణా తరగతులకు...

తెలంగాణకు సంబంధించిన కార్యక్రమాల రూపకల్పనలో ఇక్కడి అధికారుల శిక్షణాపద్ధతులు కచ్చితంగా ఉపయోగపడుతాయని కెసిఆర్ అన్నారు.

English summary
Pictures: KCR visits MCRHRD
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X