షాకింగ్: పెళ్లైన పది రోజులకే.. మణికట్టు నరాలు కోసుకోబోయిన ప్రిన్సెస్ డయానా?

Posted By:
Subscribe to Oneindia Telugu

లండన్: బ్రిటన్ యువరాణి డయానాకు సంబంధించిన ఓ షాకింగ్ నిజం తాజాగా వెలుగులోకి వచ్చింది. 1981లో ఆమెకు ప్రిన్స్ చార్లెస్‌తో వివాహం కాగా, 1997 ఆగస్టులో కారు ప్రమాదంలో యువరాణి డయానా మరణించింది.

అయితే డయానా మరణం ఇప్పటికీ వీడని మిస్టరీయే. దీనిపై ఇప్పటి వరకు అనేక కథనాలు వచ్చినా.. వాటిలో నిజమేమిటన్నది ఎవరూ నిర్ధారించలేకపోయారు. ఈ నేపథ్యంలో.. తాజాగా ఓ షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది.

Princess Diana tried to cut her wrists weeks after her wedding

పెళ్లైన పది రోజుల్లోనే డయానా ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు తెలిసింది. పెళ్లైన తర్వాత డయానా చాలా మానసిక ఒత్తిడికి గురైంది. ఇందుకు కారణం.. ఆమె భర్త ప్రిన్స్ చార్లెస్‌తో పాటు అతడి ప్రియురాలు క్యామిల్లానేనని బహిర్గతమైంది.

భర్త చార్లెస్ ప్రవర్తన కారణంగా తీవ్ర మనోవేదనకు గురైన డయానా పెళ్లైన పది రోజుల్లోనే తన రెండు చేతుల మణికట్టులను రేజర్‌ బ్లేడ్‌తో కోసుకునే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం చేస్తూ ఆమె మాట్లాడిన ఆడియో ఒకటి బయటపడడం సంచలనం సృష్టించింది.

''నేను చాలా ఒత్తిడిలో ఉన్నా.. రేజర్ బ్లేడులతో నా చేతుల మణికట్లను తెగ్గోసుకునే ప్రయత్నం చేస్తున్నా..'' అంటూ డయానా స్వయంగా మాట్లాడిన మాటలకు సంబంధించిన ఈ ఆడియో రికార్డు 1991 ప్రాంతంలో రికార్డయినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం బహిర్గతమైన ఈ ఆడియో రికార్డులన్నీ ఇన్నాళ్లు డయానా స్నేహితురాలి సాయంతో భద్రంగా ఉన్నట్లు బ్రిటన్ పత్రికలు వెల్లడించాయి. గతంలోనే డయానాపై మోర్టన్‌ అనే పుస్తకం వచ్చినప్పటికీ అందులో కేవలం స్నేహితులు మాత్రమే ఈ విషయం చెప్పినట్లు ఉండగా తాజాగా విడుదల చేస్తున్న పుస్తకం 'డయానా - హర్ ట్రూ స్టోరీ'లో మాత్రం ఆత్మహత్యా ప్రయత్నం విషయాన్ని డయానేనే స్వయంగా చెప్పినట్లు పేర్కొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Diana was so unhappy in the few weeks after her fairy tale wedding with Prince Charles that she tried to slash her wrists, according to the transcripts of secret tapes of the popular princess. The shock revelations were made in a book about her battles with depression, life with Charles and his lover Camilla . "I was so depressed, and I was trying to cut my wrists with razor blades," The Princess of Wales is quoted as saying. The "suicide" tapes - are believed to have recorded in 1991 with the help of a friend - and have remained secret for 20 years, The Sun reported. But they are now being used in a republished version of Andrew Mortons book: Diana- Her True Story.
Please Wait while comments are loading...