ఓటుకు నోటుకు ఎఫెక్ట్: స్టీఫెన్‌సన్‌కు సిఎం స్థాయి భద్రత
హైదరాబాద్: నోటుకు ఓటు కేసు ప్రభావంతో తెలంగాణ నామినేటెడ్ శాసనసభ్యుడు ఎల్విస్ స్టీఫెన్‌సన్ భద్రతను పెంచారు. ఆయనకు ముఖ్యమంత్రి, గవర్నర్ స్థాయి భద్రతను కల్పించారు. ప్రతిపక్ష నేతకు, హోం మంత్రికి కూడా అదే స్థాయి భద్రత ఉంటుంది.
నోటుకు ఓటు వ్యవహారాన్ని బట్టబయలు చేయడంతో ఆయన ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందనే భావనతో భద్రత పెంచారు. బుల్లెట్ ప్రూఫ్ కారు, 24 గంటలు సాయుధ గార్డుల రక్షణ, ఫోర్ ప్లస్ ప్లల్ గన్‌మెన్, ఓ ఎస్కార్ట్ పోలీసు వాహనాలను ఆయనకు రక్షణగా ఏర్పాటు చేశారు.

జడ్ లేదా జడ్ ప్లస్ అనే కెటగిరీని ప్రస్తావించకుండా అత్యవసర చర్యల్లో భాగంగా స్టీఫెన్‌సన్‌కు భద్రతను పెంచారు. ఆయన ఎక్కడికి వెళ్లినా పోలీసు ఎస్కార్ట్ ఉంటుంది. ఆయన ఇంటి వద్ద ఓ గార్డు ఎనిమిది గంటల షిప్ట్ ప్రకారం ఉంటాడు. ఓ ప్లాటూన్‌కు కూడా కేటాయించారు.
సాధారణంగా శాసనసభ్యులకు టూ ప్లస్ టూ భద్రత ఉంటుంది. స్టీఫెన్ విషయంలో మాత్రం ప్రత్యేక పరిస్థితిగా గుర్తించి భద్రతను పెంచారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కుంభకోణాన్ని బట్టబయలు చేయడంలో స్టీఫెన్ సన్ కీలక పాత్ర పోషించారు.












Click it and Unblock the Notifications