పాక్-చైనాతో ఒకేసారి: ఇండియన్ ఆర్మీ దేనికైనా రెడీ, 36 గంటల్లో 6సార్లు

న్యూఢిల్లీ: ఎల్వోసీలో సర్జికల్ స్ట్రయిక్ దాడి తర్వాత పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయని ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రాహా చెప్పారు. ఎల్వోసీ వెంబటి భారత సైన్యం జరిపిన దాడుల తర్వాత కూడా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదని ఆయన చెప్పారు.

ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగానే ఉందన్నారు. ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు తమ సేనలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఏకకాలంలో అటు, ఇటు యుద్ధం చేయగల సామర్థ్యం తమకు ఉందని ఆయన పాకిస్తాన్, చైనాను ఉద్దేశించి వ్యాఖ్యానించారని కూడా అంటున్నారు.

సర్జికల్ స్ట్రయిక్ దాడిపై నో

సర్జికల్ స్ట్రయిక్ దాడిపై నో

అక్టోబర్ 8న ఎయిర్ ఫోర్స్ డేను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంశంలో ఆయన మాట్లాడారు. సర్జికల్ స్ట్రయిక్ దాడుల పైన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ఆయన నిరాకరించారు. వైమానిక దళం మాత్రం సిద్ధంగా ఉందన్నారు. భవిష్యత్తులోను అలాగే ఉంటామన్నారు.

ఎలాంటి పరిస్థితికైనా సిద్ధం

ఎలాంటి పరిస్థితికైనా సిద్ధం

ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవీ ఇలా అన్నీ ఎప్పుడు సిద్ధమే అన్నారు. సర్జికల్ స్ట్రయిక్ సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి దాని గురించి మాట్లాడవద్దని అభిప్రాయపడ్డారు. పరిస్థితులు కూడా ఉద్రిక్తంగానే ఉన్నాయని తెలిపారు.

36 గంటల్లో ఆరుసార్లు పాక్ ఉల్లంఘన

36 గంటల్లో ఆరుసార్లు పాక్ ఉల్లంఘన

పాకిస్థాన్‌ వరుసగా కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడుతోంది. గడిచిన 36 గంటల్లోనే ఆరుసార్లు ఉల్లంఘనలకు పాల్పడినట్టు అధికారులు తెలిపారు. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న జమ్ము, రాజౌరీ జిల్లాల్లోని భారత సైనిక శిబిరాలు సహా సాధారణ జనావాసాలపైనా పాక్‌ సైనికులు కాల్పులు జరిపారని రక్షణ శాఖ పీఆర్వో మానిష్‌ మెహతా తెలిపారు.

వరుస ఉల్లంఘనలు

వరుస ఉల్లంఘనలు

మంగళవారం మధ్యాహ్నం 1.35 గంటలకు అఖ్నూర్‌ తహసిల్‌లోని పల్లాన్‌వాలా సెక్టారులో కాల్పులు జరిగాయన్నారు. పాకిస్తాన్ కాల్పులకు భారత సైనికులు తగిన తగిన విధంగా స్పందిస్తున్నారన్నారు. తొలుత తెల్లవారుజామున 5.15 గం.లకు రాజౌరీలో పాక్‌ సైన్యం కాల్పులకు తెగబడ్డారన్నారు. ఝాంగర్, కల్సియన్, మక్రి సబ్‌ సెక్టార్లే లక్ష్యంగా కాల్పులు జరిపారన్నారు.

భారత్ ధీటుగా జవాబు

భారత్ ధీటుగా జవాబు

మోటారు బాంబులు, ఆటోమేటిక్‌ ఆయుధాలు, చిన్నపాటి ఆయుధాలతో కాల్పులు జరిపినట్టు చెప్పారు. భారత సేనలు తగిన విధంగా బుద్ధి చెబుతున్నాయన్నారు. కాల్పులు కొనసాగుతున్నాయన్నారు. మరోవైపు, దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గామ్‌ జిల్లాలో ఉన్న పోలీస్‌ స్టేషన్‌పై మంగళవారం రాత్రి ఉగ్రమూకలు విరుచుకుపడగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+