బాబు మాటే..: హోదాపై వెంకయ్య కీలక వ్యాఖ్యలు
విజయవాడ: కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు ప్రత్యేక హోదా అంశంపై ఆదివారం నాడు స్పందించారు. హోదా సర్వరోగ నివారిణి కాదని ఆయన వ్యాఖ్యానించారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల కారణంగా హోదాపై సందిగ్ధత ఉందన్నారు. చంద్రబాబు కూడా హోదా వల్లే అన్ని సమస్యలు తీరవని చెప్పిన విషయం తెలిసిందే.
అలాగే, ప్రత్యేక హోదా కోసం పలు రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయని చెప్పారు. అసలు విభజన చట్టంలోనే ప్రత్యేక హోదా అంశం పొందుపరిస్తే బాగుండేదని, నాటి యూపీఏ ప్రభుత్వం తప్పు చేసిందని అభిప్రాయపడ్డారు.

అయినప్పటికీ ఏపీకి ప్రత్యేక హోదా పైన త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అమృత్ పథకం కింద ఏపీకి రూ.877 కోట్లు ఇచ్చామని చెప్పారు. క్విట్ ఇండియా ఉద్యమానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా కార్యక్రమాలు తెలపెట్టామన్నారు.
బీజేపీతో జగన్ లాలూచీ: అచ్చన్న తీవ్ర వ్యాఖ్య, బాబుకు సుజన వివరణకాగా, రెండు రోజుల క్రితం వెంకయ్య నాయుడు టిడిపి ఎంపీలతో మాట్లాడుతూ... ప్రధాని మోడీ అంతగా పగలబడి నవ్వారంటే మీ పని అయిపోయినట్లేనని, ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేసినట్లేనని వ్యాఖ్యానించారని తెలుస్తోంది.
ప్రధాని నరేంద్ర మోడీతో అంతకుముందు (శుక్రవారం నాడు) టిడిపి ఎంపీలు భేటీ అయ్యారు. ఆ సమయంలో ఏపీలో ఇప్పుడు అందరూ మోడీ, చంద్రబాబు నామస్మరణ చేస్తున్నారని, హోదా ఇవ్వాలని టిడిపి ఎంపీ శివప్రసాద్ కోరారు. దానికి ప్రధాని మోడీ నవ్వారు. ఈ విషయం తెలిసిన వెంకయ్య.. టిడిపి ఎంపీలతో పైవిధంగా కీలక వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications