విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏం జరుగుతోంది?: హరికృష్ణ వెంట కొడాలి నాని

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

విజయవాడ: విజయవాడ బందరు రోడ్డులో కొత్తగా నిర్మించిన వెటర్నిటీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణతో కలిసి వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని రావడం బెజవాడలో హాట్ టాపిక్ మారింది.

ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్‌కు ప్రభావితులై ఆ పార్టీలో చేరుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొడాలి నాని త్వరలో సైకిల్ ఎక్కనున్నారంటూ వార్తలు రావడంతో నేరుగా ఆయనే స్పందించారు. విజయవాడ పర్యటనకు వచ్చిన హరికృష్ణని కొడాలి నాని కలిశారు.

Ysrcp MLa Kodali Nani meets Nandamuri Harikrishna at Vijayawada

హరికృష్ణతో వ్యక్తిగతంగా ఉన్న సాన్నిహిత్యం మేరకే ఆయన్ని కలిసేందుకు వచ్చానని చెప్పారు. స్వర్గీయ ఎన్టీఆర్ పేరుతో ఆసుపత్రి ప్రారంభిస్తున్నందుకే వచ్చానని, అంతేతప్ప ఈ భేటీలో రాజకీయ ప్రాధాన్యం లేదని చెప్పారు. వారిద్దరూ ఒకే కారులో వచ్చి అక్కడి వారిని ఆశ్చర్యంలో ముంచెత్తారు.

తన ఆరాధ్య దైవం దివంగత ఎన్టీఆర్ పేరిట ఆసుపత్రి ప్రారంభోత్సవమని తెలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యానని అన్నారు. ఈ ఆసుపత్రికి తన గురువు నందమూరి హరికృష్ణ నిధులిచ్చారని, అందుకే ఆయనతో కలిసి వచ్చానని తెలిపారు. ఎన్ని పార్టీలు మారినా, తనకు హరికృష్ణే గురువని కూడా ఆయన పేర్కొన్నారు.

హరికృష్ణతో కలిసి రావడం వెనుక ఎలాంటి ప్రాధాన్యం లేదని చెప్పారు. ఎప్పటికీ తాను వైసీపీలోనే కొనసాగుతానని, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌తోనే కలిసి నడుస్తానని ఆయన ప్రకటించారు. తన రాజకీయ జీవితమంతా జగన్‌తోనే సాగుతుందని కూడా కొడాలి నాని ఈ సందర్భంగా చెప్పారు.

కాగా ఈరోజు ఉదయం విజయవాడలోని బందరు రోడ్డులో ఎన్టీఆర్ వెటర్నిటీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి ప్రత్తిపాటి మాట్లాడుతూ.. 13 జిల్లాలకు ఉపయోగపడేలా విజయవాడలో పశువుల పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

నూతన రాష్ట్రంలో ఈ వైద్యశాల పరిశోధన కేంద్రంగా సేవలందిస్తుందని తెలిపారు. రూ.1.17 కోట్లతో వైద్యశాల మిగిలిన పనులు పూర్తి చేస్తామని ప్రకటించారు. వైద్యశాల నిర్మాణం పూర్తి కావడంలో నందమూరి హరికృష్ణ ముఖ్యభూమిక పోషించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి నందమూరి హరికృష్ణతో కలిసి కొడాలి నాని హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని హాజరవడం ఆసక్తికరంగా మారింది. కాగా రాజకీయంగా చూస్తే కొడాని నానికి, టీడీపీ అధినేత చంద్రబాబుకు సంబంధాలు అంతగా లేవు. ఈ క్రమంలో కొడాలి నాని టీడీపీలోకి వచ్చే అవకాశం లేదని అంటున్నారు. గతంలో పలుమార్లు చంద్రబాబుపై నాని ఏకవచనంతో విమర్శలు చేశారు.

English summary
Ysrcp MLa Kodali Nani meets Nandamuri Harikrishna at Vijayawada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X