రూ.5 ఖర్చుతో ఏడాదంతా కాల్స్, డేటా
ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఒకటికి మించి సిమ్ కార్డులు వాడుతుంటారు. జియో, ఎయిర్ టెల్ వాడతారు. లేదంటే బీఎస్ఎన్ఎల్, ఐడియా వొడాఫోన్ వాడతారు. ఎన్ని సిమ్ కార్డులున్నప్పటికీ నెలనెలా రీఛార్జి చేయించాలంటే ఇబ్బందికరంగా మారుతుంటుంది. ఒకటి ఉన్నప్పుడు రెండోదానికి ఎందుకు.. ఓన్లీ ఇన్ కమింగ్ వస్తే సరిపోతుందికదా అని ఆలోచిస్తారు. రీఛార్జి చేయకపోతే కాల్స్ రావు. అందుకని ప్రతి ఒక్కరూ కచ్చితంగా నెల నెలా రీఛార్జి చేస్తుంటారు.
అలా కాకుండా ఒకసారి రీఛార్జి చేస్తే ఏడాదంతా అందుబాటులో ఉండే ప్లాన్ అమల్లో ఉంది. ఎయిర్ టెల్ ఈ ఆఫర్ ఇస్తోంది. రూ.1799 ప్లాన్ రీఛార్జి చేసుకుంటే అదిరిపోయే లాభాలను అందుకోవచ్చు. దీనిద్వారా అనేక రకాల ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. రూ. 1799 ప్లాన్ విషయానికి వస్తే.. దీని వ్యాలిడిటీ 365 రోజులు. సంవత్సరంపాటు రీఛార్జి అవసరంలేదు. అన్ లిమిటెడ్ కాలింగ్ ఉంది. 24 జీబీ డేటా వస్తుంది. 3600 ఎస్ఎంఎస్‌లు పంపొచ్చు.

ఈ వార్షిక రీచార్జ్ ప్లాన్‌లో భాగంగా అపోలో 24/7 సర్కిల్ మూడు నెలల సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. ఇంకా ఫ్రీ హెలో ట్యూన్స్ సర్వీసులు, నచ్చిన సాంగ్‌ను ఉచితంగానే హెలో ట్యూన్ గా పెట్టుకోవచ్చు. వింక్ మ్యూజిక్ ఉచితంగానే పొందొచ్చు. మ్యూజిక్, హెలో ట్యూన్స్, లైవ్ కన్సర్ట్స్, పాడ్ కాస్ట్స్ ఇస్తారు.
అలాగే ఎయిర్‌టెల్ రూ. 2999 ప్లాన్ కూడా అందిస్తోంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు. ఇందులో రోజుకు 2 జీబీ డేటా వస్తుంది. అన్ లిమిటెడ్ కాలింగ్ చేసుకోవచ్చు. ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ ఉంటాయి. అన్ లిమిటెడ్ 5జీ డేటా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. రూ. 3359 ప్లాన్ కూడా ఉంది. ఈ ప్లాన్ కింద రోజుకు 2.5 జీబీ డేటా వస్తుంది. ఇది కూడా ఏడాది ప్లాన్. దీని కింద డిస్నీ హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్, అన్ లిమిటెడ్ 5జీ డేటా వస్తుంది.












Click it and Unblock the Notifications