Google pixel 8 smartphone: ఇక మేకిన్ ఇండియా- అతి పెద్ద ప్లాంట్
న్యూఢిల్లీ: టాప్ సెర్చింజిన్ గూగుల్ (Google) కీలక నిర్ణయాన్ని తీసుకుంది. భారత్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టబోతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ప్రారంభించిందా కంపెనీ యాజమాన్యం. 2024 నాటికి ఈ కంపెనీ భారత్‌లో ఏర్పాటు కావడం ఖాయంగా కనిపిస్తోంది.
గూగుల్ పిక్సెల్ 8 స్మార్ట్‌ఫోన్లు (Google pixel 8 smartphone) ఇకపై భారత్‌లోనే తయారు చేయాలని నిర్ణయించిందా సంస్థ. ఆసియా దేశాలన్నింటికీ ఇక్కడి నుంచే సప్లై చేయాలనే లక్ష్యంతో దీన్ని నెలకొల్పబోతోంది. దీన్ని బట్టి చూస్తే సంవత్సరానికి 40 నుంచి 50 మిలియన్ల చొప్పున స్మార్ట్ ఫోన్లను ఈ యూనిట్ నుంచి తయారు చేయాలని భావిస్తోంది.

ఈ యూనిట్ ఏర్పాటైతే పిక్సెల్ 8 స్మార్ట్‌ఫోన్‌ల తయారీ/అసెంబ్లింగ్ ప్రాజెక్ట్ కూడా ఇక్కడే ఉంటుంది. ఆసియా దేశాలన్నింటికీ ఇక్కడి నుంచే సరఫరా చేసేలా భవిష్యత్ ప్రణాళికలను రూపొందించుకుంది గూగుల్. పిక్సెల్ స్మార్ట్ ఫోన్ల అమ్మకాల్లో భారత్‌ను అతిపెద్ద మార్కెట్‌గా భావిస్తోన్నామని గూగుల్ ఉపాధ్యక్షుడు రిక్ ఓస్టెర్లా తెలిపారు.
ఈ ఉదయం న్యూఢిల్లీలో నిర్వహించిన గూగుల్ ఫర్ ఇండియా కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ దీన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రిక్ మాట్లాడారు. అత్యుత్తమ పిక్సెల్ స్మార్ట్ ఫోన్లను తయారు చేయబోతోన్నామని, దీనికి భారత్ కేంద్రబిందువు అవుతుందని తెలిపారు. స్మార్ట్ ఫోన్ల అమ్మకాల్లో భారత్‌ను ఆసియాలోనే పెద్ద మార్కెట్ భావిస్తోన్నామని చెప్పారు.
భారత్‌లో పిక్సెల్ స్మార్ట్ ఫోన్ల తయారీకి తాము కట్టుబడి ఉన్నామంటూ గతంలో ఆల్ఫాబెట్ అధినేత సుందర్ పిచాయ్ సైతం వెల్లడించిన విషయం తెలిసిందే. త్వరలోనే దీన్ని కార్యరూపంలో పెడతామని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్రకటన వెలువడిన కొద్దిరోజుల్లోనే రిక్ ఓస్టెర్లా.. తమ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి వివరించారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications