గూగుల్ డూడుల్: కొత్త కొత్తగా సెర్చింజిన్: ఎన్నో స్పెషాలిటీలస్
వాషింగ్టన్: టాప్ సెర్చింజిన్ గూగుల్ 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ నెల 4వ తేదీన గూగుల్ 25వ పుట్టినరోజు వేడుకలను జరుపుకొంది. తాజాగా ఈ సందర్భాన్ని గూగుల్ డూడుల్ సెలబ్రేట్ చేసుకుంది. డూడుల్‌ను ఇన్‌కార్పొరేట్ చేసిన 25వ సంవత్సరాలు పూర్తయ్యాయి.
సరిగ్గా పాతిక సంవత్సరాల కిందట అంటే 1998 సెప్టెంబర్ 27వ తేదీన డూడుల్ ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఆ తేదీ నాడే అధికారికంగా బర్త్‌డే వేడుకలను జరుపుకొంటోంది ఈ సెర్చింజిన్. ఈ అర్ధరాత్రి 12 గంటలు దాటిన తరువాత గూగుల్ డూడుల్ మారిపోయింది. Google స్థానంలో G25gle అనే అక్షరాలు స్క్రీన్‌పై ప్రత్యక్షం అయ్యాయి.

స్టాన్‌ఫొర్డ్ యూనివర్ధిటీ స్టూడెంట్స్ సెర్గీ బ్రిన్, లారీ పేజ్ 1998 సెప్టెంబర్ 4వ తేదీన గూగుల్ కంపెనీని నెలకొల్పిన విషయం తెలిసిందే. ఈ పాతికేళ్ల జర్నీలో ఎన్నో విప్లవాత్మక మార్పులను యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది గూగుల్ యాజమాన్యం. వినూత్న ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ, తిరుగులేని ప్లాట్‌ఫామ్‌ను క్రియేట్ చేసుకుంది ఈ అమెరికన్ బేస్డ్ సెర్చ్ఇంజిన్.
క్రోమ్ డెస్క్‌టాప్/వెబ్ వెర్షన్ యూజర్ల కోసం డార్క్ మోడ్‌ను సైతం తీసుకొచ్చింది. యూజర్లు సిస్టమ్ థీమ్‌ను డార్క్ మోడ్‌లో పెట్టుకుంటే గూగుల్ క్రోమ్ డెస్క్‌టాప్ కూడా ఆటోమేటిగ్గా డార్క్ మోడ్‌కు మారుతుంది. గూగుల్ తొలిసారిగా 2019లో నైట్ మోడ్/డార్క్‌మోడ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

అప్పట్లో దీన్ని ఆండ్రాయిడ్ 10కే పరిమితం చేసింది. అనంతరం దాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా చారిత్రాత్మక సంఘటనలు, సందర్భాలను గుర్తు చేస్తూ రావడం డూడుల్ స్పెషాలిటీ. చంద్రయాన్ 3లో భాగమైన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్.. చంద్రుడిపై అడుగు మోపినడాన్నీ సెలబ్రేట్ చేసుకుంది డూడుల్. దేశీయ స్ట్రీట్ ఫుడ్ పానీపూరీని సైతం గుర్తించింది డూడుల్.
ఇప్పుడు తాజాగా తన బర్త్‌డే వేడుకలను గుర్తు చేస్తూ డూడుల్‌ను రూపొందించింది గూగుల్ యాజమాన్యం. 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టినట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన వివరాలను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుందర్ పిచాయ్ విడుదల చేశారు. మరిన్ని వినూత్న మార్పులను చూడబోతోన్నామంటూ కామెంట్స్ పోస్ట్ చేశారు.
-
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications