OnePlus 12: డిసెంబర్ 4న విడుదల కానున్న వన్ ప్లస్ 12..
వన్ ప్లస్ 10వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా డిసెంబర్ 4న చైనాలో వన్ ప్లస్ 12ను అధికారికంగా విడుదల చేయడానికి ఆ కంపెనీ సిద్ధమైంది. ఈ ఫోన్ ఐకూ 12, ఒప్పో రినో 11 ప్రొ వంటి ఫోన్‌లకు గట్టి పోటీని ఇస్తుందని చెబుతున్నారు. వన్ ప్లస్ 12 కు సంబంధించి కొన్ని విషయాలు బయటకొచ్చాయి. ఈ ఫోన్ మూడు రంగులో అందుబాటులో ఉండనుంది. OnePlus 12 క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 SoCపై రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 14 లేయర్‌తో పనిచేయనుంది.
వన్ ప్లస్ పోస్ట్ ప్రకారం, వన్ ప్లస్ 12 లేత ఆకుపచ్చ, రాక్ నలుపు, తెలుపు రంగుల్లో లభించనుంది. వన్ ప్లస్ 11 5G ఎండ్‌లెస్ బ్లాక్, ఫ్లాష్ ఆఫ్ గ్రీన్ కలర్స్‌లో వచ్చింది. వన్ ప్లస్ 12 డిసెంబర్ 4న స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 7:00 గంటలకు కంపెనీ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా చైనీస్ మార్కెట్‌లోకి తీసుకురానున్నారు. బ్రాండ్ ప్రస్తుతం తన అధికారిక ఆన్‌లైన్ స్టోర్, JD.com ద్వారా ఫోన్ కోసం ముందస్తు బుకింగ్ లు తీసుకుంటుంది.

వన్ ప్లస్ 2K రిజల్యూషన్‌తో BOE ProXDR డిస్‌ప్లే రానుంది. ఇది డిస్ల్పేమేట్ A+ సర్టిఫికేషన్‌ను పొందేందుకు 2K రిజల్యూషన్ డిస్‌ప్లేతో చైనాలో మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌గా పేర్కొన్నార. మింగ్ కోసం అంతర్నిర్మిత కొత్త తరం X-యాక్సిస్ మోటార్‌తో వస్తుందని వివరించారు. ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ColorOS 14లో రన్ అయ్యేలా టీజ్ చేసినట్లు పేర్కొన్ారు. ఈ ఫోన్ లో Sony LYTIA LYT808 ప్రైమరీ రియర్ కెమెరా సెన్సార్, 64-మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ను తో వస్తుంది.
వన్ ప్లస్ 12 6.82-అంగుళాల QHD+ (1,440 x 3,168 పిక్సెల్‌లు) వంపు తక్కువ-ఉష్ణోగ్రత పాలీక్రిస్టలైన్ ఆక్సైడ్ (LTPO) డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్, 32-మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్, 100W వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు తో 5,400mAh బ్యాటరీని సామర్థ్యంతో వన్ ప్లస్ 12 రానుంది.
-
పెరుగులో ఉప్పు లేదా చక్కెర - ఆరోగ్యానికి ఎవరికి ఏది మంచిది..!! -
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!!











Click it and Unblock the Notifications