Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వన్ ప్లస్ నుంచి అదిరిపోయే ఫోన్

వన్‌ప్లస్ తన మొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ ఓపెన్‌ను ఇండియా మార్కెట్ లోకి విడుదల చేసింది. శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 5తో పోటీపడుతోంది. ఈ ఫోన్ ప్రీమియం డిజైన్‌ను కలిగి ఉంది. స్నాప్ డ్రాగన్ 8 Gen 2 చిప్‌సెట్, ఫ్లెక్సియన్ హింజ్ మెకానిజంతో సహా టాప్-ఎండ్ స్పెసిఫికేషన్లున్నాయి. వన్‌ప్లస్ ఓపెన్ ధర ఇండియాలో రూ.1,39,999. ఇది ఎమరాల్డ్ డస్క్, వాయేజ్ బ్లాక్ అనే రెండు రంగుల ఆప్షన్స్‌లో ఈ నెల 27వ తేదీ నుంచి అందుబాటులో ఉండనుంది.

vegan leatherతో మంచి డిజైన్ ఉన్న నలుపు రంగు నిజంగా ప్రీమియంగా అనిపిస్తుంది. 239 గ్రాముల బరువుతో, OnePlus ఓపెన్ సూపర్ లైట్. దీన్ని మూసినా, తెరిచినా చేతిలో మంచి గ్రిప్ ఉంటుంది. ఈ హ్యాండ్ సెట్ కూడా సాధారణ ఫోల్డబుల్స్ లాగా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఇది సంప్రదాయ OnePlus అలర్ట్ స్లైడర్‌తో వచ్చింది. ఫ్లెక్సియన్ హింజ్ మెకానిజంతో వస్తుంది. ఇది చాలా తేలికైంది. పట్టుకోవడానికి చాలా చాలా సులభంగా ఉంది.

oneplus foldable phone oneplus open features

7.82-అంగుళాల ఫ్లెక్సీ ఫ్లూయిడ్ LTPO 3.0 AMOLED 2K రిజల్యూషన్ స్క్రీన్‌ ఉంది. అయితే బయటి స్క్రీన్ 6.31-అంగుళాల LTPO 3.0 AMOLED ప్యానెల్‌‌తో ఉంది. డాల్బీ విజన్, 2800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను సపోర్ట్ ఇస్తోంది. 16GB RAM, 512GB స్టోరేజ్‌, స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్‌సెట్ ఈ ఫోన్‌కి ఎనర్జీ ఇస్తుంది. ఆక్సిజన్ OS 13 వెర్షన్‌, 4 సంవత్సరాలు OS అప్‌డేట్స్, 5 సంవత్సరాలు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తున్నారు.

ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌, OISతో 48MP సెన్సార్, 48MP అల్ట్రావైడ్ సెన్సార్, OISతో మరో సెన్సార్ ఉంది. కవర్ డిస్‌ప్లే 32MP షూటర్‌. మడతపెట్టిన వెర్షన్‌లో 20MP కెమెరా ఉంటుంది. 4,805 mAh బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+