యాపిల్, గూగుల్ కు ఫోన్ పే సవాల్
ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్ పే మరో కొత్త రంగంలోకి అడుగుపెడుతోంది. యాప్ డెవలపర్ల కోసం ఇండస్ యాప్ స్టోర్ పేరుతో కొత్త వేదికను ప్రారంభించబోతోంది. ఈ స్టోర్ లో తమ అప్లికేషన్లలను లిస్టు చేయాలని డెవలపర్లను సంస్థ కోరింది. 12 స్థానిక భాషల్లో ఈ యాప్ స్టోర్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం యాప్ స్టోర్ల విషయంలో యాపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ గుత్తాధిపత్యం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఫోన్ పే వాటికి సవాల్ విసిరింది.
ఇండస్ యాప్స్టోర్ లో ఆండ్రాయిడ్ యాప్ డెవలపర్లు రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. www.indusappstore.com వెబ్ సైట్ ద్వారా యాప్స్ ను అప్ లోడ్ చేయాలని సూచించింది. తొలి సంవత్సరం డెవలపర్లనుంచి తాము ఎటువంటి రుసుము వసూలు చేయమోమని కంపెనీ తెలిపింది. తర్వాత సంవత్సరం నుంచి మాత్రం స్వల్ప మొత్తంలోనే ఫీజు తీసుకుంటామని వెల్లడించింది. యాప్ డెవలపర్ల నుంచి ఎటువంటి ప్లాట్ ఫామ్ ఫీజుగానీ ఇన్-యాప్ పేమెంట్స్ కు కమీషన్ గానీ వసూలు చేయబోమని స్పష్టం చేసింది. తమకు నచ్చిన పేమెంట్ గేట్ వేను ఉచితంగా ఇంటిగ్రేట్ చేసు8కోవచ్చని తెలిపింది.

సాధారణంగా ఇన్ యాప్ పర్చేజీలపై గూగుల్, యాపిల్ స్టోర్లు 30 శాతం కమీషన్ వసూలు చేస్తున్నాయి. అలాగే నచ్చిన పేమెంట్ ప్రాసెసింగ్ సిస్టం ఎంచుకోకుండా డెవలపర్లను నియంత్రిస్తున్నాయి. దీంతో వీటిపై యాప్ డెవలపర్లు ర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఈ సమస్యతకు తమ ఇండస్ యాప్ స్టోర్ ప్రత్యామ్నాయం కాగలదని ఫోన్ పే చీఫ్ ప్రొడక్ట్ అధికారి ఆకాశ్ డోంగ్రే తెలిపారు.












Click it and Unblock the Notifications