E-Pluto 7G Max:ఈ ఎలక్ట్రిక్ బైక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే నాన్‌స్టాప్‌గా 200 కి.మీ..స్పెషల్ ఫీచర్స్ ఇవే..!

ప్యూర్ EV- 201 KM రేంజ్ లో.. ePluto 7G Max ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. రివ‌ర్స్ మోడ్ కూడా క‌లిగిన స్కూట‌ర్ గా దీని ప్ర‌త్యేక‌త‌లెన్నో ఉన్నాయని చెబుతోంది సంస్థ.ప్యూర్ EV E ప్లూటో 7G మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ కి.. ఎలక్ట్రిక్ మోటార్‌కు కనెక్ట్ చేయ‌టంతో.. ఎంతో స్పెష‌ల్ రైడింగ్ ఎక్స్ పీరియ‌న్స్ ఇస్తుంది. రెట్రో-థీమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మాత్ర‌మే కాకుండా, మ‌రెన్నో స్పెష‌ల్ ఫీచర్లు కూడా అందుబాటులోకి తెచ్చిందీ కంపెనీ.

EV ePluto 7G Max ధర
మాట్ బ్లాక్, రెడ్, గ్రే, వైట్ .. మొత్తం నాలుగు రంగుల్లో ల‌భ్య‌మ‌వుతోన్న ప్యూర్ EV ePluto 7G Max ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారతీయ మార్కెట్లోకి విడుద‌ల చేస్తోందీ సంస్థ‌. దీని ఎక్స్- షోరూమ్ ధ‌ర‌.. కేవ‌లం రూ. 1, 14, 999 మాత్ర‌మే. ఈ స్కూటర్ బుకింగ్.. దేశవ్యాప్తంగా ఇప్ప‌టికే ప్రారంభ‌మైంది. ప్లూటో వాహ‌నాన్ని బుక్ చేసుకున్న వారికి ఈ పండుగ సీజన్ నుంచి డెలివ‌రీ ఇవ్వ‌నున్నారు.

E-Pluto 7G Max

అట్రాక్టివ్ ఫీచర్స్
రెట్రో-థీమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ గా తీర్చిదిద్దిన ePluto 7G Max ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 201 కిలోమీట‌ర్లు పాటు నాన్ స్టాప్ గా ప‌రుగులు తీస్తుంది. అంతే కాదు, ఈ EVలో ఎన్నో ఆస‌క్తిక‌ర‌మైన‌ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇది హిల్-స్టార్ట్ అసిస్ట్, డౌన్‌హిల్ అసిస్ట్, కోస్టింగ్ రీజెన్, రివర్స్ మోడ్ ను సైతం క‌లిగి ఉంది. లాంగ్ బ్యాటరీ లైఫ్ కోసం స్మార్ట్ AI వంటి స‌దుపాయాలుండ‌టం మ‌రో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌.

E-Pluto 7G Max

AIతో కూడిన స్మార్ట్ బ్యాటరీ
ఈ స్కూట‌ర్ కి క‌నెక్ట్ చేసిన ఎలక్ట్రిక్ మోటార్‌కు 3.5 kWh లిథియం- అయాన్ బ్యాటరీ ప్యాక్ ను అనుసంధానం చేయడం వ‌ల్ల‌.. ఇది 3.21 bhp మేర‌.. అత్య‌ధిక‌ శక్తినందిస్తోంది. ఈ AIS-156-సర్టిఫైడ్ బ్యాటరీ ప్యాక్‌లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన స్మార్ట్ బ్యాటరీ దీని సామ‌ర్ధ్యాన్ని మ‌రింత మెరుగు ప‌రుస్తోందని చెబుతున్నారు కంపెనీ నిర్వాహ‌కులు. రైడింగ్ ఎక్స్ పీరియ‌న్స్ ని మరింత మెరుగుపరచడానికి, మొత్తం మూడు రైడింగ్ మోడ్‌లు క‌లిగి ఉన్నాయ‌ని అంటున్నారు. దీంతో పాటు, ఈ EV స్కూటర్ 60 వేల‌ కిలోమీటర్ల వారంట్ తో వస్తోంది. దీంతో పాటు 70 వేల‌ కిలోమీటర్ల వారంటీ కూడా అందుబాటులో ఉందని చెబుతున్నారు కంపెనీ ప్ర‌తినిధులు.

E-Pluto 7G Max

సో, బైక్ ల‌వ‌ర్స్.. గోటు రైడ్.. గెట్ ద ప్రైడ్..
ఓన్ ద మ్యాక్స్.. గెయిన్ ద మ్యాగ్జిమం ఎక్స్ పీరియ‌న్స్..
అన్న‌ది వీరి స్లోగ‌న్ గా క‌నిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+