అదిరిపోయిన శామ్ సంగ్ గెలాక్సీ S24
S24 సిరీస్‌ను వచ్చే ఏడాది జనవరిలో దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం Samsung తీసుకురాబోతోంది. ఇందులో భాగంగా Samsung Galaxy S24, Galaxy S24 Plus, Galaxy 24 Ultra కూడా ఉంటాయి. ప్రతి ఏడాది కంపెనీ తన అత్యంత ప్రీమియం S సిరీస్‌ని ఫిబ్రవరిలో విడుదల చేయడం పరిపాటి. దీని విడుదలపై కంపెనీ నుంచి ఇంకా అధికారిక సమాచారం వెల్లడి కాలేదు. తాజా నివేదిక ప్రకారం Samsung Galaxy S 24 Ultraలో iPhone 15 Pro వంటి టైటానియం ఫ్రేమ్‌ను అందించనుంది.
శామ్సంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ లో స్టాండర్డ్, ప్లస్, అల్ట్రా వేరియంట్లు ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న గెలాక్సీ ఎస్23 మోడల్ విజయవంతమైంది. గెలాక్సీ ఎస్23, ఎస్23 ప్లస్ లో 8జీబీ ర్యామ్, ఎస్23 అల్ట్రాలో 12జీబీ ర్యామ్ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఫొటోగ్రఫీ కెమెరా సిస్టమ్‌తో రాబోతోంది. ఫోటోగ్రఫీ కోసం Galaxy S24 Ultra 200MP ప్రైమరీ కెమెరా + 12MP అల్ట్రావైడ్, 10MP టెలిఫోటో కెమెరా ఉంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం కంపెనీ ఈ ఫోన్లలో 12MP ఫ్రంట్ కెమెరాను ఉంది.

S24లో 6.2 అంగుళాల AMOLED డిస్‌ప్లేను, S24 ప్లస్‌లో 6.7 అంగుళాలు, S24 అల్ట్రాలో 6.8 అంగుళాల డిస్‌ప్లే ఇచ్చారు. ఇది WQHD+ రిజల్యూషన్ డిస్‌ప్లేతో ఉంటుంది. గెలాక్సీ S24 అల్ట్రా రైట్ సైడ్ అల్ట్రా-వైడ్‌బ్యాండ్ యాంటెన్నా ఉంటుంది. కెనడా, చైనా, అమెరికా వంటి ఎంపిక చేసిన దేశాలలో Qualcomm Snapdragon 8 Gen 3 ప్రాసెసర్‌ని తీసుకురాబోతున్నారు. Galaxy S24 Ultra అన్ని దేశాలలో Qualcomm Snapdragon 8 Gen 3 ప్రాసెసర్‌తో రానుంది. S24లో 4000mAh బ్యాటరీ, S24(రూ.72,990), ప్లస్(రూ.85,990)లో 4900mAh బ్యాటరీని.. S24 అల్ట్రా(రూ.1,19,990)లో 5000mAh బ్యాటరీని 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఇస్తోంది.












Click it and Unblock the Notifications