శామ్ సంగ్ గెలాక్సీ S24లో శాటిలైట్ కనెక్టివిటీ

ప్రస్తుతం ఐఫోన్ వినియోగదారులు శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్‌ను పొందుతున్నారు. సెల్యులార్ లేదా వైఫై కనెక్టివిటీ లేనప్పుడు అత్యవసర SOS సందేశాలను పంపవచ్చు. తాజాగా ఈ సదుపాయం శామ్ సంగ్ ఫోన్లలో కూడా అందుబాటులోకి వచ్చింది. Samsung Galaxy S24లో అత్యవసర సేవల కోసం శాటిలైట్ కనెక్టివిటీ సదుపాయాన్ని అందిస్తున్నట్లు కంపెనీ ధ్రువీకరించింది.

కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లలో వచ్చే ఏడాది ప్రారంభం నుంచి అత్యవసర సేవల కోసం శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్ ని (Satilite connectivity feature) అందించడం ప్రారంభిస్తుందని ధృవీకరించారు. ఈ ఫీచర్ Galaxy S24 సిరీస్‌లోని అన్ని మోడళ్లకు అందుబాటులో ఉంటుందా లేదంటే S24 అల్ట్రాకు మాత్రమే ఉంటుందా అనేది స్పష్టత లేదు.

sattelite connectivity feature in samsung galaxy S24

స్మార్ట్‌ఫోన్‌ల కోసం టూ-వే శాటిలైట్ కనెక్టివిటీని ఎనేబుల్ చేసే సాంకేతికతను అభివృద్ధి చేసినట్లు Samsung కొన్ని నెలల క్రితం వెల్లడించింది. Galaxy S24 సిరీస్‌లో ఈ సాంకేతికతను ఉపయోగించే అవకాశం ఉందని నివేదిక వెల్లడించింది. ఈ సదుపాయం 2022లో ఐఫోన్ 14 సిరీస్‌లో మొదటిసారిగా అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు iPhone 15లో కూడా ఉంది.

అత్యవసర SOS వినియోగదారుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు? వినియోగదారుడు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు? సమాధానాన్ని రిలే కేంద్రానికి పంపుతుంది. ఆ తర్వాత నిపుణులు వినియోగదారుడి తరఫున అత్యవసర సేవలను అందిస్తారు. అమెరికాలో జాతీయ రహదారిపై జరిగిన ఓ ప్రమాదం గురించి బాధితులను ఆదుకోవడానికి, తర్వాత అటువైపు వచ్చేవారిని అప్రమత్తం చేయడానికి శాటిలైట్ ఫీచర్ ఎంతో దోహదపడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+