50mp సెల్ఫీ కెమెరాతో వివో కొత్త ఫోన్

ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ వివో భారత మార్కెట్ లోకి కొత్తగా రెండు ఫోన్లను విడుదల చేసింది. వీవో వీ29, వీవో వీ29ప్రో పేరుతో వీటిని లాంచ్ చేసింది. వీటికి సంబంధించిన ప్రీ బుకింగ్స్ అక్టోబరు 5వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి. వివో అధికారిక వెబ్ సైట్, ఫ్లిప్ కార్ట్, రిలయన్స్ డిజిటల్ తోపాటు ఇతర ఆఫ్ లైన్ స్టోర్లలో కూడా అక్టోబరు 10వ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయి.

వీవో వీ29 రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని ధర రూ.32,999గా నిర్ణయించారు (8జీబీ+128జీబీ వేరియంట్). అలాగే 12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.36,999. మెజెస్టిక్ రెడ్, హిమాలయన్ బ్లూ, స్పేస్ బ్లాక్ రంగుల్లో ఫోన్లు లభిస్తాయి. వీవో వీ29ప్రో కూడా రెండు వేరియంట్లలో లభించనుంది. 8జీబీ+256 జీబీ ధర రూ.39,999 కాగా, 12జీబీ+256 జీబీ వేరియంట్ ధర రూ.42,999గా ఉంది. ఇది హిమాలయన్ బ్లూ, స్పేస్ బ్లాక్ రంగుల్లోనే లభించనుంది.

vivo v29 and vivo v29 pro camera features

వీవో వీ26 ఫోన్ 6.78 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లేతో వస్తోంది. దీని రీఫ్రెష్ రేటు 120హెర్జ్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ తో వస్తున్నాయి. 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఆక్టా కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 778 జీ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఓఐఎస్ తో కూడిన 50 ఎంపీ ప్రధాన కెమెరాకు 8 ఎంపీ వైడ్ యాంగిల్ లెన్స్, 2 ఎంపీ మోనోక్రోమ్ సెన్సర్లు ఇవ్వడంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందువైపు 50 ఎంపీ కెమెరా అమర్చారు.

వీవో వీ29 ప్రోలో కూడా దాదాపుగా ఇవే ఫీచర్లున్నాయి. అయితే దీని ప్రాసెసర్ మాత్రం వేరుగా ఉంది. ఇందులో మీడియా టెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్ ను ఇచ్చారు. కెమెరా విషయానికొస్తే ఓఐఎస్ తో కూడిన 50 ఎంపీ ప్రధాన కెమెరా, 12 ఎంపీ పోట్రెయిట్ లెన్స్, 8 ఎంపీ అల్ట్రా వైల్డ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+