Youtube: యూట్యూబ్ క్రియేటర్లకు గుడ్ న్యూస్.. ఇక మానిటైజేషన్ సులవే..!
గూగుల్ కు చెందిన ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ సంబంధించి గతంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఛానెల్‌ని మానిటైజేషన్ కు కొత్త రూల్స్ తీసుకొచ్చిన సంగతి తెలిసింది. యూట్యూబ్ భాగస్వామి ప్రోగ్రామ్ (YPP) మారిన మార్గదర్శకాల ప్రకారం ఛానల్ మానిటైజేషన్ కావడానికి కనీసం 500 మంది సబ్‌స్క్రైబర్లు ఉండాలి. అలాగే గత 90 రోజుల్లో కనీసం 3,000 గంటల వాచ్ అవర్స్ ఉండాలి.
90 రోజుల్లో కనీసం మూడు పబ్లిక్ వీడియోలను అప్‌లోడ్ చేయాలి. లేదా 3 మిలియన్ షార్ట్స్ వ్యూస్ ఉండాలి. ఇలా ఉన్నవారు మానిటైజేషన్ కు అప్లై చేసుకోవచ్చు. ఈ కొత్త నిబంధనలను మొదటగా.. యూఎస్, యూకే, కెనడా, తైవాన్, దక్షిణ కొరియాలో అమలు చేశారు. తాజాగా ఇండియాలో కూడా కొత్త నిబంధనలు అమలు చేస్తున్నారు. దీంతో కంటెట్ సృష్టికర్తలు త్వరగా మానిటైజేషన్ చేసుకోవాడనికి వీలు ఉంటుంది.

గతంలో మానిటైజేషన్ కావాలంటే 1000 సబ్‌స్క్రైబర్లు ఉండాలి. 4000 గంటల వాచ్ అవర్స్ లేదా కోటి షార్ట్స్ వ్యూస్ ఉండాలి. దీన్నిఇప్పుడు 500 మంది సబ్‌స్క్రైబర్లు, 3,000 గంటల వాచ్ అవర్స్, 3 మిలియన్ షార్ట్స్ వ్యూస్ కు కుదించారు.అదేవిధంగా కంటెంట్ సృష్టికర్తల కోసం షాపింగ్ అనుబంధ ప్రోగ్రామ్‌లను ప్రారంభించడానికి, కనీసం 20,000 మంది సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉండాలి.
తాజా నిబంధనలను పాటించే వారు మానిటైజేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. YPPలో భాగం కావచ్చు. ఇందులో సూపర్ థాంక్స్, సూపర్ చాట్ మరియు సూపర్ స్టిక్కర్‌ల ద్వారా టిప్పింగ్ ఎంపికలను ప్రారంభించడం వంటి అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఒక సృష్టికర్త మానిటైజేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత యూట్యూబ్ ఒక నెలలోపు అప్లికేషన్‌ను సమీక్షిస్తుంది.












Click it and Unblock the Notifications