ఆంధ్ర దేశంలోని ప్రధాన శైవ క్షేత్రాలలో ద్రాక్షారామం అత్యంత మహిమాన్వితం. ఈ ద్రాక్షారామం దక్షిణ కాశీగా ప్రసిద్థిచెందింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 40, కాకినాడకు 17 కిలో మీటర్ల దూరంలో వున్న ద్రాక్షారామానికి వ్యాసమహర్షి దక్షిణ కాశి అని నామకరణం చేశారని ప్రతీతి. సప్త మహర్షులు ఇక్కడ తపస్సు చేశారని, అందువల్ల ఇక్కడ నుంచి గోదావరి ఏడుపాయలుగా చీలిందని చెబుతూవుంటారు. సప్తర్షులైన భరద్వాజ, విశ్వామిత్ర, జమదగ్ని పేర్ల మీద ఉపనదులు అంతర్వాహినులుగా ప్రవహిస్తూ వుంటాయని చెబుతారు. ఇక్కడ శివుని భీమేశ్వరునిగా పిలుస్తారు. ద్రాక్షారామ భీమేశ్వరుడు స్ఫటిక లింగాకారుడై 15 అడుగుల ఎత్తు వుండడం విశేషం. ప్రధానాయలం రెండు అంతస్థులుగా వుంటుంది. చీకటిగా వుండే మొదటి అంతస్థులో భక్తులు ప్రదక్షిణలు చేసు రెండో అంతస్థులో భీమేశ్వరుని సందర్శించి పూజలు జరుపుతారు. మహాశివరాత్రి పర్వదినం ఇక్కడ కన్నుల పండువగా జరుగుతుంది. చాళుక్య భీముడు ఈ ఆలయాన్ని నిర్మించాడు.
ఆనందనిలయంః
చింతచెట్టు వింజామరగావెలసినవాడు అని ఏడుకొండలవాడినిఅభివర్ణిస్తారు. తింత్రిణీ మూలధాముడు అన్నాఅదే అర్థం. కొండ కుంగినట్లుగా నిలచినదేవుడు (మలై కునియ నివు పెరుమాళ్)అనీ అంటారు. శ్రీవేంకటేశ్వరుడు నిలిచినస్థానం తిరుమలకొండకు నాభి వలె ఉంటుంది.చుట్టూ ఎత్తయిన కొండలు హరితపుష్పపురేకల వలె ఉంటాయి. అర్చావతారంగా వెలసిన శ్రీవేంకటేశ్వరుడి విగ్రహంపై తొలినాళ్ళలోసూర్యచంద్రులు ప్రకాశించేవారు. వైష్ణవఆలయాలలో శ్రీవేంకటేశ్వరుడు తొలి ఏకధృవమూర్తి.
ఇతర దేవతలులేకుండా ప్రధాన దైవం మాత్రమేఉండడాన్ని ఏకధృవమూర్తి అంటారు.తిరుమలలో శ్రీవేంకటేశ్వరుడు వెలసినతర్వాతే హిందూ శిల్ప, ఆగమ శాస్త్రాలురూపొందాయని అంటారు. ఏకధృవమూర్తిగా వెలసినశ్రీవేంకటేశ్వరునికి తొలినాళ్ళలో ఆకాశమే పైకప్పు.వైకుంఠం నుంచి శ్రీవేంకటేశ్వరుడు దివ్యవిమానంలో అవతరించారని ఆ విమానం మానవులకుకన్పించదని భక్తులకు కన్పించేవిధంగాతొండమానుడు విమానాన్ని నిర్మించాడనిపురాణాలు చెబుతున్నాయి. గోపురాన్ని లేదా గర్భగృహంపై గల ఎత్తైన నిర్మాణాన్ని విమానం అంటారు.
తిరుమల గర్భ గృహంపైగల విమానాన్ని ఆనందనిలయం అంటారు. అసలుసిసలైన మేలిమి బంగారపు రేకులతోధగధగలాడే ఆనందనిలయం లక్ష్మీపతిభక్తులకు పరమానందం కలిగిస్తుంది.పురావస్తు ప్రమాణాల ప్రకారం క్రీ.శ. 12వశతాబ్ది ప్రాంతంలో ఆనందనిలయాన్ని నిర్మించారు.విజయనగరరాజు వీరనరసింగదేవుడుతన ఎత్తు బంగారాన్ని ఆలయానికి ఇచ్చారు. ఆబంగారంతో తొలిసారిగా ఆనందనిలయానికి పూత వేయించారు.నరసింగదేవుడు 1262 వరకు రాజ్యపాలనచేశారు. 1251 నుంచి 1275 వరకు పరిపాలించినపాండ్యరాజు జాతవర్మసుందరపాండ్యన్ విమానంపైబంగారు కలశాలను ఏర్పరచారు. కుమార కంపనవడయార్‌కు సేనాని అయిన సాళువమంగిదేవుడు 1359లో మరోసారి బంగారు తాపడంచేయించారు. 2వ దేవరాయలు కొలువులోమంత్రి అయిన మల్లన్న 1444 ప్రాంతంలోఆనందనిలయానికి మరమ్మతుచేయించారు.
9-9-1518న బహుధాన్యసంవత్సరంలో త్రిసముద్రాధీశుడు శ్రీకృష్ణదేవరాయలువిమానాన్ని మెరుగుపరచి బంగారు తాపడంచేయించారు. కంచికి చెందిన కోటికన్యకాదానం తాతాచార్యులు 1630లో బంగారు పూతపూయించారు. 1908లో మహంత్ ప్రయాగదాస్‌బంగారు కలశాలను మరోసారి ఏర్పరచారు. 1958లోతిరుమల తిరుపతి దేవస్థానం ఆనందనిలయాన్నిపూర్తిగా పునర్నిర్మాణం చేసింది. అప్పట్లో 12లక్షల రూపాయల విలువ చేసే 12వేలతులాల బంగారం వినియోగించి 18 లక్షల రూపాయలఖర్చుతో 5 ఏళ్ళలో నిర్మాణం పూర్తి చేశారు. 27 అడుగుల4 అంగుళాల భుజపు కొలత 37 అడుగుల 8 అంగుళాలఎత్తుగల చతురస్రాకారపు ఆనందనిలయానికి 3అంతస్తులు. మూల విగ్రహాన్ని దర్శించుకున్నప్పటికితనివి తీరని భక్తులు ఆరాధనగా చూసే విమానవేంకటేశ్వరుడు ఆనందనిలయపు 2వఅంతస్తులో ఉంటారు.
- పుస్తకంపై ప్రముఖుల కామెంట్స్












Click it and Unblock the Notifications