వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తిరుమల కొండ

By Staff
|
Google Oneindia TeluguNews

ఆనందనిలయంః

చింతచెట్టు వింజామరగావెలసినవాడు అని ఏడుకొండలవాడినిఅభివర్ణిస్తారు. తింత్రిణీ మూలధాముడు అన్నాఅదే అర్థం. కొండ కుంగినట్లుగా నిలచినదేవుడు (మలై కునియ నివు పెరుమాళ్‌)అనీ అంటారు. శ్రీవేంకటేశ్వరుడు నిలిచినస్థానం తిరుమలకొండకు నాభి వలె ఉంటుంది.చుట్టూ ఎత్తయిన కొండలు హరితపుష్పపురేకల వలె ఉంటాయి. అర్చావతారంగా వెలసిన శ్రీవేంకటేశ్వరుడి విగ్రహంపై తొలినాళ్ళలోసూర్యచంద్రులు ప్రకాశించేవారు. వైష్ణవఆలయాలలో శ్రీవేంకటేశ్వరుడు తొలి ఏకధృవమూర్తి.

ఇతర దేవతలులేకుండా ప్రధాన దైవం మాత్రమేఉండడాన్ని ఏకధృవమూర్తి అంటారు.తిరుమలలో శ్రీవేంకటేశ్వరుడు వెలసినతర్వాతే హిందూ శిల్ప, ఆగమ శాస్త్రాలురూపొందాయని అంటారు. ఏకధృవమూర్తిగా వెలసినశ్రీవేంకటేశ్వరునికి తొలినాళ్ళలో ఆకాశమే పైకప్పు.వైకుంఠం నుంచి శ్రీవేంకటేశ్వరుడు దివ్యవిమానంలో అవతరించారని ఆ విమానం మానవులకుకన్పించదని భక్తులకు కన్పించేవిధంగాతొండమానుడు విమానాన్ని నిర్మించాడనిపురాణాలు చెబుతున్నాయి. గోపురాన్ని లేదా గర్భగృహంపై గల ఎత్తైన నిర్మాణాన్ని విమానం అంటారు.

తిరుమల గర్భ గృహంపైగల విమానాన్ని ఆనందనిలయం అంటారు. అసలుసిసలైన మేలిమి బంగారపు రేకులతోధగధగలాడే ఆనందనిలయం లక్ష్మీపతిభక్తులకు పరమానందం కలిగిస్తుంది.పురావస్తు ప్రమాణాల ప్రకారం క్రీ.శ. 12వశతాబ్ది ప్రాంతంలో ఆనందనిలయాన్ని నిర్మించారు.విజయనగరరాజు వీరనరసింగదేవుడుతన ఎత్తు బంగారాన్ని ఆలయానికి ఇచ్చారు. ఆబంగారంతో తొలిసారిగా ఆనందనిలయానికి పూత వేయించారు.నరసింగదేవుడు 1262 వరకు రాజ్యపాలనచేశారు. 1251 నుంచి 1275 వరకు పరిపాలించినపాండ్యరాజు జాతవర్మసుందరపాండ్యన్‌ విమానంపైబంగారు కలశాలను ఏర్పరచారు. కుమార కంపనవడయార్‌కు సేనాని అయిన సాళువమంగిదేవుడు 1359లో మరోసారి బంగారు తాపడంచేయించారు. 2వ దేవరాయలు కొలువులోమంత్రి అయిన మల్లన్న 1444 ప్రాంతంలోఆనందనిలయానికి మరమ్మతుచేయించారు.

9-9-1518న బహుధాన్యసంవత్సరంలో త్రిసముద్రాధీశుడు శ్రీకృష్ణదేవరాయలువిమానాన్ని మెరుగుపరచి బంగారు తాపడంచేయించారు. కంచికి చెందిన కోటికన్యకాదానం తాతాచార్యులు 1630లో బంగారు పూతపూయించారు. 1908లో మహంత్‌ ప్రయాగదాస్‌బంగారు కలశాలను మరోసారి ఏర్పరచారు. 1958లోతిరుమల తిరుపతి దేవస్థానం ఆనందనిలయాన్నిపూర్తిగా పునర్నిర్మాణం చేసింది. అప్పట్లో 12లక్షల రూపాయల విలువ చేసే 12వేలతులాల బంగారం వినియోగించి 18 లక్షల రూపాయలఖర్చుతో 5 ఏళ్ళలో నిర్మాణం పూర్తి చేశారు. 27 అడుగుల4 అంగుళాల భుజపు కొలత 37 అడుగుల 8 అంగుళాలఎత్తుగల చతురస్రాకారపు ఆనందనిలయానికి 3అంతస్తులు. మూల విగ్రహాన్ని దర్శించుకున్నప్పటికితనివి తీరని భక్తులు ఆరాధనగా చూసే విమానవేంకటేశ్వరుడు ఆనందనిలయపు 2వఅంతస్తులో ఉంటారు.

  • పుస్తకంపై ప్రముఖుల కామెంట్స్‌

హోమ్‌ పేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X