వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పరమ పవిత్ర క్షేత్రం మంత్రాలయం

By Staff
|
Google Oneindia TeluguNews
Raghavendra Swamy
మంత్రాలయం అసలు పేరు 'మాంచాలే'. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర తీర్ధుల దేవాలయం. ఆయన శ్రీ హరి భక్తుడు. కలియుగంలో భూమిపై ధర్మాన్ని, నీతిని స్దాపించడానికి దైవసంకల్పాన జన్మించిన కారణజన్ముడు శ్రీ రాఘవేంద్ర స్వామి.రాఘవేంద్ర స్వామి జీవిత చరిత్ర అసంఖ్యాకంగా ఉన్న స్వామి భక్తులకు ఎంతో ఉత్తేజాన్ని, భక్తి భావాన్ని కలుగజేస్తుంది.
రాఘవేంద్ర స్వామి జీవిత చరిత్ర :
పూర్వాశ్రమంలో రాఘవేంద్ర స్వామి అసలు పేరు వెంకటనాథుడు. ఆయన ఒక గృహస్తుడు. ఆయన భార్య పేరు సరస్వతి, కుమారుడు లక్ష్మీనారాయణ. 'గురు సుధీంద్ర తీర్థ' వెంకటనాదుని గురువు. అత్యంత ప్రతిభావంతుడైన వెంకటనాధుని తన తదనంతరం పీఠం భాధ్యతలు స్వీకరించమని సుధీంద్ర తీర్ద ఆదేశించాడు. గురు స్దానాన్ని చేపట్టాలంటే గృహస్ద జీవితాన్ని వదులు కోవాలి. గృహస్ధు గా తన భాధ్యతలకు పూర్తి న్యాయం చెయ్యలేననే కారణంతో గురు ఆఙ్ఞను వెంకటనాధుడు వినయంగా తిరస్కరించారు. కానీ కాలక్రమంలో దైవ సంకల్పం వల్ల వెంకటనాధుడు సన్యాసాన్ని స్వీకరించి, పీఠం గురు స్దానాన్ని అలంకరించడం జరిగింది. అప్పడినుండి ఆయన గురు రాఘవేంద్రుడుగా ప్రసిద్దుడయ్యారు. ఆయన తన జీవితమంతా అవిశ్రాంతంగా శ్రీ హరి మహాత్మ్యాన్ని ప్రవచించి, విస్తృతి చేశాడు. శ్రీ హరి కృప వల్ల ఆయన నయం కాని రోగాలను నయం చేయడం, మరణించిన వారిని బ్రతికించడం, నిరక్షరాస్యుడైన వెంకన్నను పండితునిగా చేయడం వంటి ఎన్నో మహిమలను ప్రదర్ళించారు. అలాంటి వాటిలో బాగా చెప్పుకోదగింది ఆదోని రాజు సిద్ది మసూద్ ఖాన్ గర్వాన్ని అణచడం. స్వామిని అవమానించాలనే ఉద్దేశ్యంతో సిద్ది మసూద్ ఖాన్ పంపిన మాంసం తో కూడిన తినుబండారాలను స్వామి పళ్ళు గా మార్చడంతో ఖాన్ రాఘవేంద్ర స్వామి శరణు వేడి వెంటనే ఒక అత్యంత సస్యశ్యామలమైన జాగీరుని స్వామికి సమర్పించాడు. స్వామి నవ్వుతూ జాగీరుని తిరస్కరించి తను తుంగభద్రా నదికి తల్లిగా భావించే మంత్రాలయాన్ని మాత్రం స్వీకరించారు. ఆంధ్ర ప్రధేశ్ లోని కర్నూలు జిల్లాలో తుంగభద్రా నది ఒడ్డున మంత్రాలయం ఉంది. మద్రాసు, ముంబై, బెంగుళూరు, హైదరాబాదు మొదలుకొని పలు ప్రాంతాలనుండి మంత్రాలయానికి బస్సు సౌకర్యం ఉంది. మద్రాసు నుండి 595 కిలోమీటర్లు, ముంబై నుండి 690 కిలో మీటర్లు, హైదరాబాదునుండి 360 కిలోమీటర్ల దూరంలో మంత్రాలయం ఉంది. ఇక్కడ యాత్రికులు బస చేయడానికి అవసరమైన అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ముంబై- మద్రాస్, డిల్లీ-బెంగుళూరు, హైదరాబాదు-తిరుపతి వెళ్ళే రైలు మార్గంలో మంత్రాలయం ఉంది. ఆ స్టేషన్ పేరు "మంత్రాలయం రోడ్డు". రైల్వే స్టేషన్ నుండి మంత్రాలయం 16కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడినుండి ప్రైవేటు జీపులు, ఆటోల లాంటి ప్రైవేటు వాహనాల సాయంతో మంత్రాలయానికి సులువుగా చేరుకోవచ్చు. సాధారణంగా ప్రతిరోజూ ఉదయం 6గంటలనుండి మద్యాహ్నం 2గంటల వరకు, సాయంత్రం 4గంటల నుండి రాత్రి 9 గంటల మధ్య దేవాలయాన్ని దర్శించవచ్చు. ఇటీవలి కాలంలో దేవాలయానికి లభించిన "బంగారు రథం" ప్రత్యేక ఆకర్షణ. వెండి, మామూలు రథాలు దేవాలయంలో ఉన్నా బంగారు రథం దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేయడం కన్నుల పండువగా ఉంటుంది.దేశం లోని పలు ప్రాంతాలనుండి భక్తులు ఇక్కడికి వస్తుంటారు.యూత్రికులను ఇంతగా ఆకర్షిస్తున్న ఈ దేవాలయం మూడువందల సంవత్సరాల క్రితం నిర్మించబడింది.
మంత్రాలయంలోని ఇతర దర్శనీయ స్దలాలు:
రాఘవేంద్ర స్వామి బృందావనం: రాఘవేంద్ర స్వామి సజీవ సమాధి పొందిన స్దలంశ్రీ గురు సార్వభౌమ విద్యా పీఠం: ఇది ఒక సంస్కృత విద్యా పీఠం. ఈ విద్యాపీఠం శ్రీ రాఘవేంద్ర బృందావనం వెనకవైపు ఉంది. ఇక్కడి గ్రంధాలయంలో సంస్కృత పలు రచనలు, ప్రాచీన కాలం మెదలుకొని ఆధునిక కాలం వరకు రచనలు లభ్యమౌతాయి.
మాంచాలమ్మ దేవాలయం. మంచాలమ్మ పార్వతి దేవి ఇక్కడ మాంచాలమ్మ గా కొలవబడుతుంది. రాఘవేంద్ర బృందావనానికి వెళ్ళకముందు మాంచాలమ్మ ను దర్శించుకోవడం ఆనవాయితీ.
శ్రీ వేంకటేశ్వర దేవాలయం : మంత్రాలయం క్యాంపస్ లో శ్రీ వేంకటేశ్వర దేవాలయం దర్శించుకోదగిన మరో స్ధలం. ఈ దేవాలయం ప్రాముఖ్యత ఏమిటంటే గుడిలోని వేంకటేశ్వరస్వామి మూర్తిని స్వయంగా శ్రీ రాఘవేంద్ర స్వామి ప్రతిష్టించడం.
శివలింగం: తుంగభద్రా నది మద్యలో నిర్మించిన మంటపం లోని పెద్ద శివలింగం కన్నుల పండువగా ఉంటుంది.
పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం: మంత్రాలయం నుండి 5కిలో మీటర్ల దూరంలో పంచముఖి ఆంజనేయ స్వామి కోవెల ఉంది. ఇక్కడి ప్రత్యేకత ఆంజనేయ స్వామి ఐదు ముఖాలతో ఉండటం. ఈ దేవాలయంలోని ఆంజనేయ స్వామి చాలా మహిమగలవాడని ప్రతీతి.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X