భారీగా పెరిగి బంగారం ధర.. ఇంకా పెరుగుతుందా..!
కొద్ది రోజులు పాటు తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఇప్పుడు మళ్లీ పెరుగుతోన్నాయి. తాజాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1910 పెరిగి రూ.1,59,280 వద్ద ట్రేడవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1750 పెరిగి రూ. 1,45,000 మార్క్ తాకింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి రేట్లు భగ్గుమంటున్నాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సు ధర మళ్లీ 5100 డాలర్ల మార్క్ ను దాటేసింది. ఈరోజు ఔన్స్ గోల్డ్ రేటు 128 డాలర్ల మేర పెరిగింది. దీంతో గోల్డ్ రేటు ఒక ఔన్సుకు 5106 డాలర్ల పైన పలుకుతోంది. కిలో వెండి ధర రూ.2,90,000 మార్క్ తాకింది.
Video Published On: Sunday, Feb 22, 2026, 11:45 [IST]


Click it and Unblock the Notifications