బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర : ఎగ్జామ్ లేకుండానే ఉద్యోగాలు..!
నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సువర్ణావకాశం అందిస్తుంది. 2026 సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా 600 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ అవకాశాలతో యువ గ్రాడ్యుయేట్లకు బ్యాంకింగ్ రంగంలో అడుగు పెట్టే మంచి అవకాశం లభించనుంది. రాష్ట్రాల వారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో 11 పోస్టులు, తెలంగాణలో 17 పోస్టులు కేటాయించారు.
ఈ ఉద్యోగాలకు ముఖ్యంగా రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక జరగడం వల్ల గ్రాడ్యుయేట్లకు ఇది ఆకర్షణీయమైన నోటిఫికేషన్‌గా మారింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు చివరి తేదీకి ముందే దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం. ఈ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా సంబంధిత పని అనుభవం తప్పనిసరిగా పేర్కొన్నారు. దీని గురించి పూర్తి వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

వయోపరిమితి & సడలింపులు..
అభ్యర్థుల వయస్సు కనీసం 20 ఏళ్లు, గరిష్టంగా 28 ఏళ్లు మధ్య ఉండాలి.
సడలింపులు ఇలా ఉన్నాయి:
- ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులకు - 5 సంవత్సరాలు
- ఓబీసీ అభ్యర్థులకు - 3 సంవత్సరాలు
- పీడబ్ల్యూబీడీ (దివ్యాంగులు) - గరిష్టంగా 10 సంవత్సరాలు
వయోసడలింపు ఇతర ప్రభుత్వ నిబంధనలకు లోబడి వర్తిస్తుంది.
ఎంపిక విధానం..
- ఈ అప్రెంటిస్ పోస్టులకు రాత పరీక్ష ఉండదు.
- అభ్యర్థుల ఎంపిక విద్యార్హతల ఆధారంగా రూపొందించే మెరిట్ లిస్ట్ ప్రకారమే జరుగుతుంది. దీంతో పరీక్ష భయం లేకుండా అర్హత కలిగిన వారికి అవకాశాలు పెరుగుతాయి.
స్టైపెండ్ & శిక్షణ కాలం..
ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో నెలకు ₹12,300 స్టైపెండ్ అందజేస్తారు. ఈ అప్రెంటిస్‌షిప్ ద్వారా బ్యాంకింగ్ కార్యకలాపాలపై ప్రాక్టికల్ అవగాహన లభించడంతో పాటు భవిష్యత్తు బ్యాంక్ ఉద్యోగాలకు ఇది మంచి అనుభవంగా ఉపయోగపడుతుంది.
దరఖాస్తు విధానం & తేదీలు..
అర్హత గల అభ్యర్థులు 2026 జనవరి 15 నుంచి జనవరి 25 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి, అర్హతలు, రాష్ట్రాల వారీ ఖాళీలు, ఇతర నిబంధనలను పరిశీలించాలని బ్యాంక్ సూచించింది.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications