బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం

బంగారం, వెండి ధరలు నేడు కుప్పకూలాయి. ఏకంగా అయిదు శాతం వరకు పతనం అయ్యాయి. కిందటి ట్రేడింగ్ సెషన్ తో పోల్చుకుంటే 10,000 రూపాయల మేర నష్టపోయాయి. అమెరికా డాలర్ బలోపేతం కావడం, ముడి చమురు ధరలు భారీగా పెరుగుతోండటం వంటి కారణాలతో దేశంలో బంగారం, వెండి ధరలు గణనీయంగా పడిపోయాయి. ఇరాన్-అమెరికా యుద్ధం వంటి అంతర్జాతీయ పరిణామాలు ఈ పతనానికి దోహదపడ్డాయి.

మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో బంగారం, వెండిలో భారీగా అమ్మకాలు చోటుచేసుకున్నాయి. అంతర్జాతీయంగా మాత్రం వీటి ధరలు పెరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే బంగారం, వెండి ధరలు 5.50 శాతం వరకు పడిపోయాయి. గోల్డ్ ఫ్యూచర్స్ లో ఏకంగా అయిదు శాతం మేర పతనమైంది. 10 గ్రాములకు 1,37,924 రూపాయల వద్ద చేరింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా అదే పరిస్థితిని చవి చూసింది. 5.41 శాతం పడిపోయి కిలోకు 2,14,500 రూపాయల వద్ద ట్రేడ్ అయింది.

Gold and Silver Tumble on MCX as Strong US Dollar Roils Markets opened 5 Percent lower at 140158

ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,45,960 ఉండగా, 22 క్యారెట్లు బంగారం ధర రూ. 1,33,790గా నమోదైంది. కిలో వెండి రూ. 2,44,900కి తగ్గింది. ఢిల్లీ, జైపూర్‌లలో 22 క్యారెట్ల బంగారం రూ. 1,33,940, 24 క్యారెట్లు రూ. 1,50,110 వద్ద స్థిరపడింది. అహ్మదాబాద్, పూణేలలో 22 క్యారెట్ల బంగారం రూ. 1,33,840, 24 క్యారెట్లు రూ. 1,50,010 వద్ద ట్రేడ్ అయింది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 1,33,790, 24 క్యారెట్లు బంగారం రూ. 1,45,960గా ఉన్నాయి.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 14,128, 22 క్యారెట్లు - రూ. 12,950, 18 క్యారెట్లు - రూ. 10,800

ముంబై..

24 క్యారెట్లు - రూ. 14,002, 22 క్యారెట్లు- రూ. 12,835, 18 క్యారెట్లు - రూ. 10,502

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 14,002, 22 క్యారెట్లు- రూ. 12,835, 18 క్యారెట్లు - రూ. 10,502

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 14,002, 22 క్యారెట్లు- రూ. 12,835, 18 క్యారెట్లు - రూ. 10,502

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 14,002, 22 క్యారెట్లు- రూ. 12,835, 18 క్యారెట్లు - రూ. 10,502

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 14,002, 22 క్యారెట్లు- రూ. 12,835, 18 క్యారెట్లు - రూ. 10,502

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+