సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!!

సికింద్రాబాద్ స్టేషన్ రూపు రేఖలు మారిపోయాయి. విమానాశ్రయం తరహాలో రైల్వే స్టేషన్ కొత్త రూపు సంతరించుకుంటోంది. అభివృద్ధి పనులు చివరి దశకు వచ్చాయి. ఇక్కడ పనుల కారణంగా పలు ప్రధాన రైళ్లను చర్లపల్లికి మార్పు చేసారు. దీంతో, ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నారు. కాగా, సికింద్రాబాద్ నుంచి తిరిగి రైళ్లు పూర్తి స్థాయిలో పునరుద్దరణ.. స్టేషన్ నుంచి రాకపోకలు గతంలో మాదిరి నిర్వహణ పైన రైల్వే నుంచి కీలక అప్డేట్ అందుతోంది.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పైన బిగ్ అప్డేట్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులతో కొన్ని రైళ్లను ఇతర స్టేషన్ల నుంచి మళ్లించారు. ఏయిర్ పోర్ట్ తరహాలో స్టేషన్ ను తీర్చి దిద్దారు. ప్రయాణీకుల కోసం ఆధునిక సదుపాయాలు కల్పించారు. ఫేజ్ -1 పనులు దాదాపు పూర్తయ్యాయి. దీంతో, ప్రయాణీకులకు అనుమతి పైన రైల్వే శాఖ తాజాగా ముహూర్తం ఖరారు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెలలో తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఏప్రిల్‌ మొదటి వారంలో ప్రధాని పర్యటన కొనసాగే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.

PM Modi likely to inaugurate Renovated Secunderabad station in next month as officials latest discussions

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు ప్రధాని ప్రారంభోత్సవం చేస్తారు. సుమారు రూ.650 కోట్లతో ఈ స్టేషన్‌ను ఆధునికీకరిస్తున్న సంగతి తెలిసిందే. యాదాద్రి ఎంఎంటీఎస్‌ ప్రాజెక్టు పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. కొన్ని జాతీయ రహదారులను జాతికి అంకితం చేసే విధంగా షెడ్యూల్ ఫిక్స్ చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపు రేఖలు మారిపోయాయి. పూర్తిగా ఆధునీకరణతో ఏయిర్ పోర్టు తరహాలో దర్శనమిస్తోంది.

విమానాశ్రయం తరహాలో కొత్త స్టేషన్

ఎస్కలేటర్లు, ఎలివేటర్లతో నేరు ఒకటో అంతస్తులోకి ప్రవేశం.. పైన వెయింటింగ్‌ హాళ్లు, దుకాణాలు.. వాటి కింద రైల్వే ప్లాట్‌ఫారాలతో ఆకట్టుకుంటోంది. , బస్‌స్టేషన్‌ నుంచి రైల్వేస్టేషన్‌లోకి రావడానికి.. రైల్వేస్టేషన్‌ నుంచి నేరుగా వాటికి చేరుకునేందుకు స్కై వాక్‌లు ఏర్పాటు చేసారు. గతంలో చూసిన స్టేషన్ .. ఇప్పుడున్న రూపుతో పోల్చుకోలేని విధంగా ఆధునీకరించారు. అద్భుతంగా రూపు దిద్దుకుంటున్న సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ త్వరలోనూ తిరిగి ప్రయాణీకులకు అందుబాటులోకి రానుంది. ఆధునీకరణ పనుల్లో భాగంగా తొలిదశలో భాగంగా ప్లాట్‌ఫామ్‌-10 వైపు చేపట్టిన వర్కులు పూర్తికావడంతో.. మార్చి నెలాఖరు కల్లా అందుబాటులోకి తెచ్చేందుకు దక్షిణ మధ్య రైల్వే కసరత్తు చేస్తోంది.

నాలుగు అంతస్తులతో 22,516 చ.మీ వైశాల్యంతో చేపట్టిన ఐకానిక్‌ స్టేషన్‌భవనం పనులు దాదాపు పూర్తయ్యాయి. కాగా, ఇక స్టేషన్ లో దక్షిణం వైపు 14,972 చదరపు మీటర్ల విస్తీర్ణంతో మరో భవనం పూర్తి చేసారు. రూ.719కోట్లతో నిర్మిస్తున్న స్టేషన్‌ తొలిదశ భవనాలు ఇవి. రెండో దశలో మొదటి ప్లాట్‌ఫామ్‌ వైపు భవనాలు కూడా పూర్తయితే స్టేషన్‌ స్వరూపం పూర్తిగా మారిపోనుంది. రెండో దశ పనులు ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేసే విధంగా అధికారులు ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+