క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!
ప్రస్తుతం బాలీవుడ్‌లో 'ఆదిత్య ధర్' పేరు ట్రెండింగ్‌లో ఉంది. బాక్స్‌ఫీస్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'ధురంధర్-2' చిత్ర దర్శకుడైన ఆయన, కేవలం మూడు సినిమాలతోనే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందారు. ఢిల్లీలో పుట్టి పెరిగిన కాశ్మీర్ పండిట్ ఆదిత్య.. చిన్నప్పటి నుంచే భారత క్రికెటర్‌గా ఎదగాలని కలలు కన్నాడు. టీమిండియాలో ఆడాలనే లక్ష్యంతో కఠోర సాధన చేసి, అండర్-19 జట్టులో చోటు దక్కించుకొని ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు.
ఆదిత్య ధర్‌కు అన్యాయం
అయితే, 2002లో జరిగిన అండర్-19 ప్రపంచకప్ జట్టు ఎంపికలో ఆదిత్య ధర్‌కు అన్యాయం జరిగిందని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఆల్‌రౌండర్‌గా మెప్పించిన ఆదిత్యకు బదులు, మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ కుమారుడు స్టువర్ట్ బిన్నీని ఎంపిక చేశారని ప్రచారాలు జరిగాయి. రోజర్ బిన్నీ రాజకీయాల వల్లే తాను అన్యాయానికి గురయ్యానని భావించి, ఎంతో ఇష్టపడిన క్రికెట్‌ను ఆదిత్య వదిలేసినట్లు సమాచారం.

బాలీవుడ్‌లో రచయిత నుంచి డైరెక్టర్ వరకు..
క్రికెట్‌ను వీడిన అనంతరం ఆదిత్య ముంబైకి వచ్చి బాలీవుడ్‌లో రచయితగా అడుగుపెట్టాడు. పలు చిత్రాలకు కథలను అందిస్తూ, ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తూ దర్శకత్వ మెళకువలను నేర్చుకున్నాడు. ఈ అనుభవం ఆయన దర్శకత్వ కెరీర్‌కు పునాది వేసింది. 2019లో 'ఉరి: ది సర్జికల్ స్ట్రైక్' సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన ఆదిత్య సంచలన విజయం సాధించాడు. ఈ చిత్రం అతనికి దేశవ్యాప్త గుర్తింపును అందించింది. అంతేకాకుండా, తొలి చిత్రానికే ఉత్తమ దర్శకుడిగా ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారం కూడా అందుకున్నాడు.
అగ్రదర్శకుల జాబితాలో ఆదిత్య ధర్!
ఆ తర్వాత తన సోదరుడితో కలిసి నిర్మాణ సంస్థను స్థాపించిన ఆదిత్య, తన భార్య యామీ గౌతమ్‌ను ప్రధాన పాత్రలో నటింపజేసి 'ఆర్టికల్ 370' చిత్రాన్ని నిర్మించి విజయం సాధించాడు. గతేడాది విడుదలైన 'ధురంధర్', తాజాగా వచ్చిన 'ధురంధర్ 2' చిత్రాలు వందల కోట్ల క్లబ్‌లో చేరి బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. ముఖ్యంగా 'ధురంధర్ 2' ఆదిత్యను అగ్ర దర్శకుల జాబితాలో నిలబెట్టింది.
'ఉరి' సినిమా షూటింగ్ సమయంలో నటి యామీ గౌతమ్‌తో ప్రేమలో పడి, 2021లో వివాహం చేసుకున్నాడు. 2024లో ఈ దంపతులకు కుమారుడు కూడా జన్మించాడు. మొత్తానికి, క్రికెటర్ కాలేకపోయినప్పటికీ, బాలీవుడ్‌లో విజయవంతమైన దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్నాడు. ప్రతిభ ఎవరి సొంతం కాదని ఆదిత్య ధర్ తన ప్రయాణం ద్వారా నిరూపించాడు. నేడు టీమిండియా క్రికెటర్లు సైతం ఆయన సినిమాలకు క్యూ కట్టేలా ఎదిగాడు.
-
సిరాజ్‌ను చూడగానే తట్టుకోలేకపోయిన ఆశా భోస్లే మనవరాలు! వీడియో -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం!












Click it and Unblock the Notifications