'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?

ప్రముఖ డైరెక్టర్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చి 'ధురంధర్' సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనమే కాకుండా అందులోని క్యారెక్టర్లు కూడా చర్చనీయాంశంగా మారాయి. అయితే ముఖ్యంలో ఈ సినిమాలు 20 ఏళ్ల సారా అర్జున్ పోషించిన 'యలీనా జమాలి' పాత్ర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఆ పాత్ర వెనుక ఉన్న అసలు నిజానిజాలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

'ధురంధర్' చిత్రం వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందించిన ఓ యాక్షన్ థ్రిల్లర్. పాకిస్థాన్‌లోని ల్యారీ ప్రాంతం, భారత్‌పై జరిగిన ఉగ్రదాడులు వంటి అంశాలను ఈ సినిమాలో వాస్తవికంగా చూపించారు. అయితే ఈ చిత్రంలో చూపించిన క్యారెక్టర్లు కూడా నిజ జీవిత వ్యక్తుల నుంచి ప్రేరణ పొందినవే కావడంతో యలీనా జమాలీ పాత్రపై ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

Dhurandhar Yaleena Jamali Fact or Fiction The Truth Behind Nabil Gabol Daughter Story

జమీల్ జమాలి పాత్ర వెనుక ఉన్నది ఎవరంటే?
ధురంధర్ చిత్రంలోని జమీల్ జమాలి క్యారెక్టర్ పాకిస్థాన్ రాజకీయ నాయకుడు నబీల్ గబోల్ ఆధారంగా రూపొందించబడిందని ప్రచారం సాగుతోంది. దీంతో సినిమాలో చూపించినట్లుగా జమాలి కూతురు యలీనాకు నిజంగానే ఓ భారత గూడఛారితో వివాహం జరిగిందా? ఆమె ఇప్పుడు ఎక్కడ ఉంది? అనే విషయాలపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

ఇంతకు యలీనా పాత్ర నిజమేనా?
యలీనా పాత్రను పాక్ రాజకీయ నేత నబీల్ గబోల్ కూతురితో ముడిపెడుతూ సోషల్ మీడియాలో అనేక థియరీలు వినిస్తున్నాయి. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. పాకిస్థాన్ నేత నబీల్ గబోల్‌కు అసలు కూతుర్లే లేకపోవడం గమనార్హం. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నట్లు అధికారక సమాచారం ఉంది. కానీ మహీన్ గబోల్, నాడియా గబోల్ అనే ఇద్దరు మహిళల పేర్లు ఈ చర్చల్లో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. నాడియా గబోల్.. ఈమె నబీల్ గబోల్ అన్న కూతురు కాగా.. ఆమె ఓ సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందారు. మరో మహిళ మహీన్ గబోల్‌పై రకరకాల ప్రచారాలు ఉన్నాయి. ఆమె రెహమాన్ డకైత్ సోదరుడు ఉజైర్ తో సంబంధం కలిగి ఉందని.. ఆ ఉజైర్‌పై ఇండియన్ స్పై అనే అనుమానం ఉండేదని కొందరు వాదిస్తుంటారు. ఈ గొడవ తర్వాత నబీల్ ఆమెను కువైట్ పంపించేశారని అంటారు. అయితే దీనికి ఎలాంటి ఆధారాలు లేవు.

పాక్ నేత నబీల్ గబోల్ రియాక్షన్
ఈ సినిమాలో తన కుటుంబాన్ని చూపించిన విధానంపై పాక్ రాజకీయ నేత నబీల్ గబోల్ స్పయంగా స్పందించారు. తన కూతురికి ఓ భారతీయ గూఢచారితో వివాహం జరిగినట్లు చూపించడంలో ఎలాంటి వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. సినిమా ఆసక్తికరంగా ఉండటం కోసం, మసాలా జోడించడం కోసమే చిత్ర బృందం ఇలాంటి కల్పిత కథలను సృష్టించారని ఆయన కొట్టిపారేశారు. మొత్తానికి ధురంధర్ సినిమాలోని యలీనా పాత్ర వెండితెరపై అద్భుతమే కానీ.. రాజకీయ నేత కూతురు, భారత గూఢచారి మధ్య నడిచే డ్రామా అంతా కేవలం సినిమాటిక్ లిబర్టీ మాత్రమేనని స్పష్టమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+