తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం
Horoscope: గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలోనే కొన్ని అరుదైన యోగాలను ఏర్పరుస్తుంటాయి. ఈ యోగాలవల్ల కొన్ని రాశులకు బాగా కలిసివస్తుంది. ఈనెల 19వ తేదీన మనకు తెలుగు నూతన సంవత్సరం ఉగాది ప్రారంభమైంది. ఈ ఏడాది పరాభవ నామ సంవత్సరం ఉంటుంది. ఏప్రిల్ నెలలో తులా రాశి, వృశ్చిక రాశివారి జాతక ఫలం ఎలా ఉంటుందనేది తెలుసుకుందాం.
తులా రాశి
తుల రాశి వారికి ఏప్రిల్ నెలలో కొంత ఒత్తిడి ఉంటుంది. అయినా పట్టుదలతో విజయం సాధిస్తారు. ఉద్యోగులు పై అధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి. పనితీరుపై విమర్శలు వస్తాయి జాగ్రత్తగా ఉండాలి. నెలాఖరులో కొత్త ప్రాజెక్టులు దక్కే అవకాశం ఉంది. ఖర్చులు అదుపులో ఉండవు. విలాసాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పొదుపుపై దృష్టి పెట్టడం అవసరం. భూమి లేదా వాహన కొనుగోలు విషయాల్లో ఆచి తూచి అడుగు వేయండి.

రక్తపోటు లేదా నడుము నొప్పి వంటి సమస్యలు వస్తాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమయానికి భోజనం చేయడం ముఖ్యం. కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు మృదువుగా మాట్లాడండి. ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి. శుక్రవారం మహాలక్ష్మి అష్టకం పఠించడం లేదా తెలుపు రంగు వస్తువులను దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ నెల అద్భుతంగా ఉండబోతోంది. వీరు తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా జీతాల పెంపు ఉండే అవకాశం ఉంది. రెండింటిలో ఒకటి ఉంటుంది. మీ తెలివితేటలతో క్లిష్టమైన సమస్యలను పరిష్కరిస్తారు. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం. ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. అకస్మాత్తుగా ధనలాభం ఉంది. పాత అప్పులు తీర్చివేస్తారు. షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు లాభసాటిగా ఉంటాయి.
ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆందోళన అవసరం లేదు. పాత రోగాల నుంచి విముక్తి లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. తోబుట్టువుల నుంచి మద్దతు లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దూర ప్రయాణాలు లాభదాయకంగా మారతాయి. మంగళవారం హనుమాన్ చాలీసా పఠించడం లేదా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల ఆటంకాలు తొలగిపోతాయి.












Click it and Unblock the Notifications