పిఠాపురంలో కేడర్ కు తేల్చి చెప్పిన నాగబాబు, వర్మ కీలక నిర్ణయం..!!
పిఠాపురం కేంద్రంగా రాజకీయం కొత్త మలుపు తీసుకుంది. జనసేన- వర్మ వివాదం తో తాజాగా రెండు పార్టీల మధ్య గ్యాప్ పెరుగుతోంది. తాజాగా చోటు చేసుకున్న ప్రోటోకాల్ వివాదం లో వర్మ తీరు పైన పార్టీ అధినేత చంద్రబాబు అసహనం వ్యక్తం చేసారు. ఈ అంశం పైన పార్టీ అధ్యక్షుడు పల్లాతో చర్చించారు. ఇదే సమయంలో నాగబాబు పిఠాపురంలో పర్యటించారు. పార్టీ శ్రేణులతో సమావేశం అయ్యారు. కీలక దిశా నిర్దేశం చేసారు. దీంతో.. వర్మ అప్రమత్తం అవుతున్నారు.
పిఠాపురంలో కూటమి పార్టీల నేతల లెక్కలు మారుతున్నాయి. తాజాగా ప్రోటోకాల్ వివాదంలో వర్మ - జనసేన నేతల మధ్య జరిగిన ఘర్షణ వేళ అటు టీడీపీ.. ఇటు జనసేన అధినాయకత్వం అలర్ట్ అయింది. అటు సీఎం చంద్రబాబు నియోజకవర్గ ఇంఛార్జ్ వర్మ తీరు పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. పదే పదే ఇలాంటి వివాదాలు సరి కాదన్నారు. దీంతో.. అటు డిప్యూటీ సీఎం పవన్ సైతం వెంటనే పిఠాపురం వెళ్లాల్సిందిగా సోదరుడు నాగబాబుకు సూచించారు. పవన్ సూచనల మేరకు నాగబాబు నియోజకవర్గాలో పార్టీ కేడర్ తో సమావేశమయ్యారు. ఎక్కడా వర్మ పేరు ప్రస్తావన లేకుండానే పార్టీ శ్రేణులకు కీలక దిశా నిర్దేశం చేసారు. అటు చంద్రబాబు ఆగ్రహం తో వర్మ సైలెంట్ అయ్యారు. అందరూ పార్టీ నిర్ణయం మేరకు మౌనంగా ఉండాలని.. భవిష్యత్ పరిణామాల కు అనుగుణంగా నడుచుకోవాలనే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది.

పవన్ పిఠాపురం కోసం కీలక నిర్ణయం
ఇక.. పార్టీ శ్రేణుల సమావేశంలో నేతలంతా కలసికట్టుగా పనిచేసుకోవాలని సూచించారు. ఇదే సమయంలో పరోక్షంగా తన లక్ష్యం ఏంటో తేల్చి చెప్పారు. పిఠాపురం అంటేనే పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం అని నాగబాబు వ్యాఖ్యానించారు. తాము ఎన్నికల్లో ఒక మాట ఇచ్చామంటే తప్పకుండా అమలు చేసి తీరుతామని చెప్పారు. పార్టీ క్యాడర్ ఆవేశాన్ని ఆవేదనను తాను అర్ధం చేసుకున్నానని పవన్ కళ్యాణ్ కూడా తొందరలోనే వారి సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు.
ఇక పార్టీ సమావేశంలో నాగబాబు క్యాడర్ కి సున్నితంగానే క్లాస్ పీకారు. కాగా.. పవన్ పిఠాపురం తన శాశ్వత నియోజకవర్గంగా మార్చుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో.. వర్మ భవిష్యత్ ఆలోచనలు ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications