షాకింగ్: మద్యం తాగించి బీటెక్ విద్యార్థినిపై క్లాస్ మేట్ అత్యాచారం

సమాజంలో రోజురోజుకూ మహిళలు, బాలికలపై దాడులు, అత్యాచారాలు పెరిగిపోతూనే ఉన్నాయి. చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా కొన్ని మానవ మృగాలు ప్రవర్తిస్తున్నాయి. ఆడపిల్ల అయితే చాలు అని మృగాళ్లలా మీదపడిపోతున్నారు. వావి వరసలు మరచి అత్యాచారాలకు తెగబడుతున్న వారు మరోవైపు ఉన్నారు. తమ కామ వాంఛ కారణంతో ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పోక్సో, నిర్భయ, దిశ లాంటి ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా.. కఠినంగా శిక్షించినా ఇలాంటి ఘటనలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ లో షాకింగ్ ఘటన జరిగింది.

బీటెక్ విద్యార్థినికి మాయమాటలు చెప్పి తోటి క్లాస్ మేట్ అత్యాచారానికి పాల్పడిన ఘటన ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారింది. హైదరాబాద్ లోని ఇబ్రహీంపట్నంలో ఈ దారుణమైన ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా నార్కెట్ పల్లికి చెందిన ఉడుతల ఉదయ్ కిరణ్ ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అదే కాలేజీలో చదివే యువతితో పరిచయం పెంచుకున్నాడు ఉదయ్. అయితే యువతితో కలిసి ఈ నెల 14 రాత్రి బయట టీ తాగేందుకు కారులో దిల్ సుఖ్ నగర్ కు తీసుకెళ్లాడు. అయితే తిరిగి ఇబ్రహీంపట్నం వస్తుండగా యువతికి తెలియకుండా మద్యం కొనుగోలు చేశాడు.

Ibrahimpatnam Horror BTech Student Raped Classmate After Being Drugged in Hyderabad Ibrahimpatnam

ఆ తర్వాత కారును ఇబ్రహీంపట్నం బీడీఎల్ లోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి యువతికి మద్యం తాగించాడు. అలా మద్యం మత్తులో ఉన్న ఆమెను తన స్నేహితుడి రూమ్ కు తీసుకెళ్లాడు ఉదయ్. అక్కడే ఆమెపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇక తెల్లారి మే 15 న బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. మూడురోజుల్లో నిందితుడ్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+