ఎంత పని చేశారు మోడీ సార్ ? సాయిరెడ్డి మరో షాక్..!
ఒకప్పుడు వైసీపీ ఎంపీగా కేంద్రం వద్ద, ప్రధాని మోడీ వద్ద మంచి మార్కులు సంపాదించుకున్న విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) ఆ తర్వాత రూటు మార్చి రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. ఆ తర్వాత కూడా బీజేపీపై, కేంద్రంపై తన మమకారం వదులుకోలేక వరుసగా ట్వీట్లు పెడుతూ వచ్చిన విజయసాయిరెడ్డి.. ఇప్పుడు మరోసారి యూటర్న్ తీసుకున్నారు. కేంద్రం తాజాగా తీసుకున్న ఓ నిర్ణయాన్ని బహిరంగంగానే తప్పుబడుతూ సాయిరెడ్డి ఓ ట్వీట్ చేశారు.
కేంద్రం తాజాగా వాణిజ్య గ్యాస్ సిలెండర్ల (Commercial LPG Cyclinder) ధరను ఏకంగా రూ.933 పెంచింది. దీంతో ఇప్పుడు వాణిజ్య గ్యాస్ సిలెండర్ ధర 3 వేలు దాటిపోయింది. దీని ప్రభావం దేశవ్యాప్తంగా రెస్టారెంట్ల వ్యాపారంపై తీవ్రంగా పడుతోంది. ఈ నిర్ణయంపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఇదే క్రమంలో విజయసాయిరెడ్డి కూడా స్పందించారు. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర ₹2,031 నుండి ₹3,024కు, అంటే ₹933 మేర పెరగడం భారతదేశవ్యాప్తంగా ఉన్న 5 లక్షలకు పైగా రెస్టారెంట్లకు భారీ షాక్ అన్నారు.

The ₹933 hike in commercial LPG cylinder from ₹2,031 to ₹3,024 is a massive shock to 5 lakh+ restaurants across India. Their margins will be crushed, prices will rise, and workers will bear the brunt through wage cuts and job losses. This cost spiral will hit both businesses…
— Vijayasai Reddy V (@VSReddy_MP) May 2, 2026
కేంద్రం తీసుకున్న గ్యాస్ ధర పెంపు నిర్ణయంతో రెస్టారెంట్ల లాభాలు పూర్తిగా దెబ్బతింటాయని, ధరలు పెరుగుతాయని, వేతన కోతలు, ఉద్యోగ నష్టాల రూపంలో కార్మికులు తీవ్ర భారాన్ని మోయాల్సి వస్తుందని సాయిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ధరల పెరుగుదల వ్యాపారాలను, వినియోగదారులను తీవ్రంగా దెబ్బతీస్తుందన్నారు. ఈ ఇరాన్ యుద్ధం ఇప్పుడే ఆగాలని కోరారు. తద్వారా యుద్దం ఆపి ధరల్ని నియంత్రించాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందని చెప్పకనే చెప్పారు.












Click it and Unblock the Notifications