SIR తో బూత్ కు 50 ఓట్ల తొలగింపు? నేతలకు జగన్ బిగ్ అలర్ట్..!

దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ కార్యక్రమం (SIR) ఏపీలోనూ నిన్న ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఓటర్ల జాబితాల సవరణ కోసం బీఎల్వోలు ఇళ్లకు వెళ్లి దరఖాస్తు ఫారాలు పంపిణీ చేస్తున్నారు. వీటిని నింపిన తర్వాత తీసుకుని ఓటర్ల జాబితాలను అప్ లోడ్ చేస్తారు. అయితే ఈ ప్రక్రియను అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో వైసీపీ ఓట్లను భారీ ఎత్తున తొలగించేందుకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) అనుమానిస్తున్నారు. దీంతో ఇవాళ పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చారు.

ఓట్ల ప్రత్యేక సమగ్ర సవరణపై నియోజకవర్గాల్లోని కో-ఆర్డినేటర్లు, రీజనల్‌ ఇన్‌ఛార్జిలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జగన్ ఆదేశాలు ఇచ్చారు. సర్‌ ప్రక్రియ జరుగుతున్న తీరుపై ప్రతిరోజూ సమీక్ష చేయాలని, ఎక్కడైనా తప్పులు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. అప్పటికీ సమస్య పరిష్కారంకాకపోతే వెంటనే పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకు రావాలని సూచించారు. వచ్చే నాలుగు వారాలు అత్యంత కీలకమని, సర్‌ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వద్దన్నారు. సర్‌ ప్రక్రియలో ఒక్కసారి ఓటు తొలగించిన తర్వాత దాన్ని తిరిగి చేర్పించాలంటే అత్యంత కష్టంగా మారుతుందని జగన్ తెలిపారు. ప్రతి నియోకవర్గ సమన్వయకర్త దీన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నారు.

Vote Deletion Plot Jagan Warns YSRCP Leaders to Stay Alert as SIR Process Begins in AP

ఇవాళ తాడేపల్లి ఆఫీసులో పార్టీ సీనియర్లతో భేటీ అయిన జగన్.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు, తన అధికార దుర్వినియోగంతో ఏదోరకంగా వైయస్సార్‌సీపీకి చెందిన ఓట్లను తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. బూత్‌కు కనీసంగా 50 ఓట్లు తొలగించాలని చూస్తున్నారన్నారు. గిమ్మిక్కులతో ఓట్లు తొలగించే తప్పుడు పనుల్లో చంద్రబాబు ఆరితేరిన వ్యక్తని, వైసీపీ కోఆర్డినేటర్లు, బూత్‌లెవల్‌ ఏజెంట్లు దీన్ని అడ్డుకోవాలని, ప్రతి ఓటునూ కాపాడుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న సర్‌ ప్రక్రియపై ప్రతి అంశంలోనూ అప్రమత్తత, నిరంతర సమీక్షలు నిర్వహించాలని జగన్ ఆదేశాలిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+