Raghav Chadha: "అబద్ధాల కోరును కాకి పొడిచింది.."-రాఘవ్ చద్దాపై బీజేపీ పోస్టు వైరల్..!

ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ నుంచి రాజ్యసభకు పంపిన రాఘవ్ చద్దా (Raghav Chadha) పేరు ఈ మధ్య పార్లమెంట్ తో పాటు దేశవ్యాప్తంగా తెగ వినిపించింది. దీనికి ప్రధాన కారణం ఆయన సామాన్యుల కోణంలో సంధించిన ప్రశ్నలే. మొబైల్ ఆపరేటర్లు నెల రోజులకు ఇవ్వాల్సిన ప్రీపెయిడ్ రీఛార్జ్ ను 28 రోజులకు ఇవ్వడం ఏంటని ఆయన వేసిన ప్రశ్న ఎందరినో ఆలోచింపజేసింది. దీంతో రాఘవ్ చద్దా సామాన్యుల ఎంపీగా తక్కువ కాలంలోనే గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఆ తర్వాత ఆప్ ఆయన్ను రాజ్యసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా తప్పించడం, నిన్న ఆయన ఆప్ ను వీడి బీజేపీలో చేరడం జరిగిపోయాయి.

అయితే ఇన్నాళ్లు తనపై తీవ్ర విమర్శలు చేసిన బీజేపీలో రాఘవ్ చద్దా చేరడం చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో గతంలో ఆయనపై బీజేపీ విమర్శలు చేస్తూ చేసిన సోషల్ పోస్టు ఒకటి వైరల్ అవుతోంది. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ దీన్ని ఎక్స్ లో రీపోస్టు చేశారు. ఇందులో రాఘవ్ చద్దాను అబద్దాల కోరుగా పేర్కొంటూ ఢిల్లీ బీజేపీ చేసిన విమర్శలు ఉన్నాయి. అప్పట్లో పార్లమెంట్ నుంచి బయటికి వస్తున్న రాఘవ్ చద్దాను ఎగురుతున్న కాకి పొడిచిన ఫొటో కూడా ఉంది.

BJP s Viral 2023 Dig At Liar Raghav Chadha Comes Back To Haunt Them On His Joining Day

అబద్ధాలకోరు రాఘవ్ చద్దాను కాకి పొడిచిందంటూ ఢిల్లీ బీజేపీ 2023లో ఎక్స్ లో ఈ పోస్టు పెట్టింది. ఈ పోస్టును అప్పట్లో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే రాఘవ్ చద్దా కూడా పార్లమెంట్ లో యాక్టివ్ గా ఉన్నా ఇప్పుడు ఉన్నంత యాక్టివ్ గా లేరు. కానీ మారిన పరిస్ధితుల్లో ఆయన పార్లమెంట్లో వ్యూహాత్మకంగా ప్రజల కోణంలో ప్రశ్నలు అడిగినట్లు నటించడం, బీజేపీ పరోక్షంగా వాటిని వైరల్ చేయడం, చివరికి ఆయన ఆప్ ను వీడి బీజేపీ గూటిలో చేరడం, కేజ్రివాల్ లో కలిసి తాను మొదలుపెట్టిన ఆప్ పైనే తీవ్ర విమర్శలకు దిగడం చర్చనీయాంశంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+