ఆ దేశంలో భారత్ ఉత్పత్తులకు 100 శాతం సుంకాలు రద్దు.. సంచలన ఒప్పందం..
ప్రస్తుతం ప్రపంచ దేశాలు పశ్చిమాసియాలో ఉద్రిక్తతల్లో మునిగిపోయి ఉన్నాయి. ఇరాన్- అమెరికా- ఇజ్రాయెల్ మధ్య రెండు నెలలుగా జరుగుతున్న ఆందోళనలో ఉన్నాయి. ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసివేయడంతో ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దాంతో ఆయా దేశాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత్ ముందుచూపుతో వ్యవహరించింది. న్యూజిలాండ్ తో సంచలన ఒప్పందం చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంది. భారత్- న్యూజిలాండ్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్(FTA) జరగనుంది. ఈ మేరకు ఇరు దేశాల నాయకులు ఏప్రిల్ 27 న సంతకాలు చేయనున్నారు.
ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ఇటు భారత్ కు సరిహద్దు దేశాలైన పాకిస్థాన్, చైనాలతో ముప్పు పొంచి ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ తన దేశ ప్రయోజనాలకోసం న్యూజిలాండ్ తో కీలక ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు భారత్- న్యూజిలాండ్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ జరిగింది. ఏప్రిల్ 27న ఇరు దేశాల నాయకులు ఈ ఒప్పందంపై సంతకాలు చేయనున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా న్యూజిలాండ్ కు ఎగుమతయ్యే భారతీయ ఉత్పత్తులపై 100 శాతం పన్నులు రద్దు అవుతాయి. ముఖ్యంగా వస్త్రాలు, తోలు వస్తువులు, ఆటోమొబైల్ విడిభాగాలు, తివాచీలు తదితర వస్తువులకు ప్రాధాన్యం దక్కనుంది.

భారత్- న్యూజిలాండ్ మధ్య జరిగిన ఈ ఒప్పందం ద్వారా ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. వచ్చే ఐదేళ్లలో తమ వాణిజ్యాన్ని 5 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలని భారత్, న్యూజిలాండ్ దేశాలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. ఇక అటు న్యూజిలాండ్ తో పాటు భారత్ కూడా న్యూజిలాండ్ నుంచి వచ్చే 95 శాతం ఉత్పత్తులపై టారిఫ్ లను తగ్గించనుంది. అయితే దేశంలోని రైతాంగాన్ని కాపాడేందుకు పాలు, చీజ్ వంటి డెయిరీ ప్రొడక్ట్స్ ను ఈ ఒప్పందం నుంచి మినహాయించింది. ఈ ఒప్పందంలో భాగంగా రాబోయే 15 ఏళ్లలో భారత్ లో 20 బిలియన్ డాలర్లు పెట్టుబడులే లక్ష్యంగా ముందుకెళ్లనుంది.












Click it and Unblock the Notifications