తమిళ ప్రజలకు స్టాలిన్ గుడ్ న్యూస్..! ఫలితాలకు ముందే..!
తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. రేపు ఎన్నికలు ఎలా జరిగాయో ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడబోతున్నాయి. ఇలాంటి సమయంలో ముఖ్మమంత్రి ఎంకే స్టాలిన్ ( MK Stalin) తమిళనాడు ప్రజలకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో ఐదేళ్లుగా తాము అనుసరిస్తున్న ద్రవిడ మోడల్ అందించిన ఫలితాన్ని ఆయన ఎక్స్ లో షేర్ చేసుకున్నారు. ఎన్నికల ఫలితాల విడుదల వేళ స్టాలిన్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
తమిళనాడు అనుసరిస్తన్న ద్రావిడ మోడల్ విలక్షణమైనదని, ఇది గణాంకాలతో నిరూపించబడిందని సీఎం ఎంకే స్టాలిన్ ట్వీట్ చేశారు. తాము మూడేళ్లలో పునాది వేశామని, వరుసగా రెండు సంవత్సరాలు రెండంకెల వృద్ధిని సాధించామని స్టాలిన్ వెల్లడించారు. ఈ పురోగతికి తమిళనాడు ప్రజలే చోదకశక్తి అన్నారు. మీ కృషికి, మాపై ఉంచిన నమ్మకానికి ధన్యవాదాలు అని ట్వీట్ లో పేర్కన్నారు.

ఇది ఆరంభం మాత్రమేనని, మీ మద్దతుతో ఈ పురోగతి మరింత వేగవంతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. తాము భారతదేశంలోనే పోటీ పడటం లేదని, తమిళనాడు దక్షిణాసియాకు నాయకత్వం వహిస్తుందంటూ స్టాలిన్ తన ట్వీట్ ముగించారు. తమిళనాడులో ఐదేళ్లుగా ప్రభుత్వాన్ని నడుపుతున్న స్టాలిన్.. కేంద్రం నుంచి తగినంత సహకారం లభించకపోయినా ఆర్ధిక వృద్ధి విషయంలో వెనక్కి తగ్గలేదు. సంస్కరణల అమలు విషయంలోనూ నిక్కచ్చిగా వ్యవహరించారు. దీని ఫలితమే ఆర్ధిక వృద్ధి రెండంకెలకు చేరడం అని నిపుణులు చెప్తున్నారు.












Click it and Unblock the Notifications