కేరళలో మారుతున్న అధికారం? ఫలితాలకు ముందే సీఎం విజయన్ షాకింగ్ నిర్ణయం!

కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటానికి ముందే ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన సోషల్ మీడియా ఖాతాలో చేసిన ఓ మార్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కేరళ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు కేవలం ఒక్కరోజు ముందు ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన సోషల్ మీడియా (ఎక్స్, ఫేస్‌బుక్) బయోలో కీలక మార్పులు చేశారు. గతంలో తన బయోలో 'కేరళ ముఖ్యమంత్రి' అని ఉండగా.. దానిని తొలగించి ఇప్పుడు కేవలం 'పాలిట్ బ్యూరో సభ్యుడు, భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్)' అని మార్చుకున్నారు. ఫలితాలు రాకముందే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం అధికార మార్పిడికి సంకేతమా? లేక ఓటమిని అంగీకరించడమేనా? అనే చర్చలు రాజకీయ వర్గాల్లో మొదలయ్యాయి.

ఎగ్జిట్ పోల్స్ అంచనాలు.. ఎల్డీఎఫ్‌కు షాక్?
ఈసారి వెలువడిన దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ కేరళలో అధికార మార్పిడి జరుగుతుందని అంచనా వేశాయి. అధికార ఎల్డీఎఫ్ కూటమి వెనుకబడిందని.. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమికి స్పష్టమైన మెజారిటీ లభించే అవకాశం ఉందని సర్వేలు పేర్కొన్నాయి. ఈ అంచనాల నేపథ్యంలోనే ముఖ్యమంత్రి తన హోదాను సోషల్ మీడియా నుంచి తొలగించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే దీనిపై పార్టీ వర్గాల నుంచి ఇంకా అధికారిక వివరణ రాలేదు.

Pinarayi Vijayan Changes Social Media Bio ahead of Kerala Election Results Signal of Power Shift

ధర్మడమ్ స్థానంలో హోరాహోరీ పోరు
పినరయి విజయన్ తన సొంత గడ్డ అయిన ధర్మడమ్ నియోజకవర్గం నుండి వరుసగా మూడోసారి విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నారు. గతంలో 2016, 2021 ఎన్నికల్లో ఆయన ఇక్కడ భారీ మెజారిటీతో విజయం సాధించారు. అయితే ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి వీపీ అబ్దుల్ రషీద్, బీజేపీ అభ్యర్థి కె. రంజిత్ నుంచి ఆయనకు గట్టి పోటీ ఎదురైనట్లు తెలుస్తోంది. కంచుకోట వంటి ఈ స్థానంలో ఓట్ల శాతం తగ్గడం కూడా వామపక్ష కూటమిని ఆందోళనకు గురిచేస్తోంది.

మే 4న తేలనున్న కేరళ భవిష్యత్తు
కేరళలో ఏప్రిల్ 9న ఒకే దశలో జరిగిన ఎన్నికల్లో దాదాపు 78.27 శాతం ఓటింగ్ నమోదైంది. గత పదేళ్లుగా అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ హ్యాట్రిక్ సాధిస్తుందా? లేదా కేరళ సంప్రదాయం ప్రకారం మళ్లీ యూడీఎఫ్ అధికారంలోకి వస్తుందా? అనేది రేపు (మే 4) వెలువడే ఫలితాల్లో తేలిపోనుంది. కేరళతో పాటు తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి ఫలితాలు కూడా రేపే వెలువడనున్నాయి. ముఖ్యమంత్రి సోషల్ మీడియా మార్పుతో కేరళ ఫలితాలపై దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+