బెంగాల్ ఫలితాల పై మోదీ మార్క్ ట్విస్ట్ - అక్కడే అసలు లెక్క..!!
పశ్చిమ బెంగాల్ సమరం తుది దశకు చేరుకుంది. ఈ సాయంత్రంతో రెండో విడత ఎన్నికల ప్రచారం ముగియనుంది. 29న పోలింగ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలి విడత పోలింగ్ పూర్తి అయిన సమయం నుంచి బీజేపీలో ధీమా కనిపిస్తోంది. బీజేపీకి ప్రజలు పట్టం కట్టారని ముఖ్య నేత లు చెబుతున్నారు. కాగా.. చివరి రోజు ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ బెంగాల్ ఫలితాల పైన తన మార్క్ విశ్లేషణ చేసారు. తిరిగి బెంగాల్ లో బీజేపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి వస్తానని చెప్పటం ఆసక్తి కరంగా మారుతోంది.
ప్రధాని మోదీ బెంగాల్ వేదికగా చివరి ప్రచార సభలో పాల్గొన్నారు. మే 4 తరువాత మళ్లీ బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు వస్తానని చెప్పారు. ఒడిశా, బీహార్ లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి .. ఇక, ఇప్పుడు బెంగాల్ లోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని ధీమా వ్యక్తం చేసారు. రాష్ట్ రంతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుత బంగాల్ ఎన్నికల ప్రచారం లో ఇదే తన చివరి బహిరంగ సభ అని మోదీ అన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూ లంగా వస్తాయనే విశ్వాసం తనకుందని చెప్పారు. ప్రచార కార్యక్రమాల్లో ప్రజల నుంచి తనకు అందిన సందేశాలు, కానుకల గురించి మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. వాటిని తాను ఎంతో గౌరవిస్తానని తెలిపారు.

రెండు పార్టీల ధీమా.. అసలు విజేత
తొలి విడతలో రికార్డు పోలింగ్ శాతం నమోదు కావటంతో బీజేపీ లెక్కలు తమకు అనుకూలంగా ఉన్నాయనే ధీమాతో ఉంది. అటు మమతా బెనర్జీ తొలి విడతలో తమకు వంద సీట్లు వస్తాయని చెబుతున్నారు. మోదీ- అమిత్ షా లెక్కల మేరకు బీజేపీకి తొలి విడతలోనే 120 స్థానాలు వస్తాయ ని వెల్లడించారు. రెండో విడతలో ఖచ్చితంగా మరింత మెరుగైన సీట్లు సాధిస్తామని బీజేపీ లెక్కలు వేస్తోంది. రెండో విడత పోలింగ్ సున్నిత ప్రాంతాల్లో జరగనుండటంతో ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పుడు బెంగాల్ లో గెలుపు బీజేపీ - మమత కు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. దీంతో.. రెండో విడత పోలింగ్.. ఆ తరువాత ఓట్ల లెక్కింపు పైన దేశ వ్యాప్తంగా రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications